Adultrated Toddy | పాపన్నపేట, జూలై 12 : పాపన్నపేట మండల పరిధిలోని దాదాపు అన్ని గ్రామాల్లో కల్తీ కల్లు అడ్డు అదుపూ లేకుండా కొనసాగుతుంది. వందకు తొంబై శాతం దుకాణాలను ఎలాంటి అనుమతులు లేకుండా నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఏడుపాయలలో మంజీరా నది ఒడ్డున ఏలాంటి అనుమతులు లేకుండా అక్రమ కల్లు దుకాణం కొనసాగుతుంది. మంజీరా నది చెక్ డ్యాం సమీపాన స్నానగట్ల ఒడ్డున అక్రమ కల్లు దుకాణం ఉండడంతో కల్తీ కల్లు తాగి భక్తులు నీటిలో స్నానానికి దిగి చనిపోతున్నారు.
ఏడుపాయలలో ఎంత లేదన్నా సగటున నెలకు ముగ్గురు చొప్పున మృత్యువాత పడుతున్నారు. వారు తాగింది కల్తీ కల్లు కావడంతో అది తాగి నీటిలో మునిగిన వారు మళ్లీ గడ్డకు వచ్చిన దాఖలాలు లేవు. పాపన్నపేట మండలంలో ఎక్కడ కూడా ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ లేకపోవడంతో దాదాపు కల్లు మొత్తం కల్తీ మయమే.. కల్లు తయారీలోముఖ్యంగా నిషేధిత మత్తు పదార్థమైన అల్ఫాజోలం, డైజో ఫామ్, గంజాయి పౌడర్ లాంటి మత్తు పదార్థాలను వాడడంతో తాగేవారు మత్తుకు బానిసలైపోతున్నారు. దీనికి అలవాటు అయిన వారు అది లేకుండా ఉండలేకపోతున్నారు.
ఒకవేళ కల్లుకు అలవాటు పడినవారు. ఒకటి రెండు రోజులు లేకుంటే వింతగా ప్రవర్తిస్తూ పిచ్చిపిచ్చిగా చేస్తున్నా.. దాఖలాలు కోకొల్లలు, గతంలో సమ్మక్క సారక్క జాతరకు వెళ్లిన ఆర్టీసీ డ్రైవర్ కల్లు లేక వింతగా ప్రవర్తించడంతో అక్కడి ఆర్టీసీ ఆర్ఎం, వీరి ప్రవర్తనకు కారణమైన కల్లు గురించి తెలుసుకొని వారిని తమ డిపోకు రిటర్న్ పంపించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఏడుపాయల, నాగసానిపల్లి కొత్తపల్లి, ఎల్లాపూర్, యూసఫ్ పేట, మిన్పూర్, చిత్రియాల్, గాజుల గూడెం కొడపాక, మల్లంపేట లింగయ్య పల్లి తదితర గ్రామాల్లో అక్రమ కల్లు దుకాణాలు నడపడమే కాకుండా విపరీతమైన కల్తీ జరుపుతున్నారు.
మత్తును బట్టి కల్లు సీసా ధర నిర్ణయిస్తున్నారంటే పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థమవుతుంది. ఇంకా కొన్ని దుకాణాల్లో మత్తు కావాలంటే చీపురు పుల్లతో మత్తులో ముంచి కల్లు బాట్లో అది మరి కల్లు రేటు డిసైడ్ చేస్తున్నారు. ఇటీవల కాలంలో హైదరాబాద్ కూకట్పల్లిలో కల్తీకల్లు తాగి పలువురు ప్రాణాలు పోగొట్టుకున్నప్పటికీ మండలంలో మాత్రం ఎలాంటి చొరవ తీసుకున్న దాఖలాలు లేవు. అల్ఫాజోలం కిలో ఒక్కింటికి రూ.5 లక్షల నుండి 7 లక్షల వరకు పూణే నుండి కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం. సంబంధిత అధికారులు ఇప్పటికైనా కల్తీకల్లు దుకాణాలపై కొరడా ఝళిపించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.
Siddipet | సాగు నీటి కోసం.. ఆశగా రైతుల ఎదరుచూపులు
Army Jawan Donate | ఆర్మీ జవాన్ ఆదర్శం.. మొదటి వేతనం ఆలయానికి అందజేత
BRS | బీఆర్ఎస్ హాయంలోనే గ్రామపంచాయతీల అభివృద్ధి :ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి