జిన్నారం, మే 8 : గ్రామీణ ప్రాంతాల్లో ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నట్లు పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా జిన్నారం పురపాలక సంఘం పరిధిలోని కొర్లకుంటలో చిత్తారమ్మ విగ్రహ ప్రతిష్ఠాపన వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు.
జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, జిన్నారం మున్సిపల్ చైర్మన్ జనార్దన్, మాజీ జడ్పీటీసీ బాల్‌రెడ్డి, అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్, బీఆర్ఎస్ జిల్లా నాయకులు వెంకటేశంగౌడ్, ప్రకాశ్‌చారి, నర్సింహ, పాల్గొన్నారు.