కల్హేర్, ఫిబ్రవరి 13: లెక్కలేనన్ని హామీలిచ్చి అధికారంలోకి వచ్చాక అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజలను మోసం చేస్తున్నదని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి విమర్శించారు. గురువారం కల్హేర్ మం డలం మహాదేవుపల్లి చౌరస్తాలో 161నంబర్ జాతీ య రహదారి పై ఆయన ఆధ్వర్యంలో కల్హేర్, నిజాంపేట్ మం డలాల నాయకులు, కార్యకర్తలు, రైతులు రాస్తారోకో నిర్వహించారు. దీంతో జాతీయ రహదారిపై ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచి పోయాయి.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకులు అభివృద్ధి నిరోధకులుగా మిగిలారని మండిపడ్డారు. మహాదేవుపల్లి రోడ్డు నుంచి కల్హేర్ మీదుగా నల్లవాగు, కల్హేర్ నుంచి పిట్లం వరకు బీటీ రోడ్లు నిర్మాణానికి, నారాయణఖేడ్ నుంచి ర్యాకల్ వరకు రోడ్డు మంజూరు చేస్తే, కాంగ్రెస్ నాయకుల ఒత్తిడి తట్టుకోలేక కాంట్రాక్టర్ పనులు నిలిపి వేశారన్నారు.
తాను మంజూరు చేయించిన పనులను ప్రారంభించకుండా ఎమ్మెల్యే సంజీవరెడ్డి, జహీరాబాద్ ఎంపీ సురేశ్ షెట్కార్ కక్ష సాధిస్తున్నారని ఆరోపించారు. పదేండ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. కాంగ్రెస్ పాలనలో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంలా తయారైందన్నారు. రాస్తారోకోలో మాజీ జడ్పీటీసీ నర్సింహారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాంసింగ్, మాజీ జడ్పీ కో ఆప్షన్‌సభ్యుడు అలీ, ఆత్మకమిటీ మాజీ చైర్మన్ దిలీప్‌కుమార్, పీఏసీఎస్ చైర్మన్ గంగారెడ్డి, నాయకులు నారాయణరావు, దుర్గారెడ్డి, అంజిరెడ్డి, బాలయ్య, ప్రభు, నర్సింహగౌడ్, సాయిలు, గణపతి, లక్ష్మణ్, రాంసింగ్, వెంకట్‌నాయక్, జనార్ధన్సార్, పండరి, కుర్మసాయిలు, ప్రశాంత్‌సాగర్, యాకుబ్ తదితరులు పాల్గొన్నారు.