నారాయణఖేడ్, డిసెంబర్ 18 : సమాజహితం కోసం మహత్మా భోంగొండేశ్వర్ చేసిన బోధనలు అనుసరణీయమని, ప్రతి ఒక్కరూ ఆయన అడుగుజాడల్లో నడవాలని ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. నారాయణఖేడ్ పట్టణంలో ఆదివారం భోంగొండేశ్వర్ విగ్రహావిష్కరణలో ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. గొల్లకుర్మలను చైతన్యపర్చడంలో భోంగొండేశ్వర్ ఎంతో కృషి చేశారని కొనియాడారు. గొల్లకుర్మల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ప్రత్యేక పథకా లను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షుడు గొల్లసాయి ప్రభాకర్, బీసీ సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు నరేశ్ యాదవ్, నాగల్గిద్ద వైస్‌ఎంపీపీ పండరీయాదవ్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు నగేశ్, నాయకులు రవీందర్‌నాయక్, గోపాల్, సంజీవ్, నవనాథ్, జైపాల్ పాల్గొన్నారు. ముందు గా విగ్రహదాత బాపు మల్శెట్టి విగ్రహావిష్కరణలో పాల్గొన్నారు.
‘ఖేడ్’లో వేగవంతంగా వసతుల కల్పన
నారాయణఖేడ్ పట్టణంలో వసతుల కల్పన కోసం చర్య లు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. పట్టణంలోని రాయిపల్లిరోడ్డు ప్రాంతంలో నిర్మించిన పబ్లిక్ టాయిలెట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించి మాట్లాడారు. రోజురోజుకు పట్టణం విస్తరించడానికి తోడు పెరుగుతున్న జనాభాకనుగుణంగా మౌలిక వసుతులు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పట్టణంలో ప్రతిరోజూ రద్దీగా ఉండే రాజీవ్‌చౌక్ వద్ద టాయిలెట్లు లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి ఇప్పటికే మూడు పబ్లిక్ టాయిలెట్లను నిర్మించగా మరో రెండు చోట్ల నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ పరశురామ్, మున్సిపల్ కమిషనర్ మల్లారెడ్డి, కౌన్సిలర్లు, మాజీ సర్పంచ్ ఎంఏ నజీబ్ పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు నారాయణఖేడ్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో సీఎం సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకం వర్తించని పరిస్థితుల్లో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందిన వారిని ప్రభుత్వం సీఎం సహాయనిధి ద్వారా ఆదుకుంటుందన్నారు.