ఆరుమాసాల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. సంగారెడ్డి జిల్లా జోగిపేటలో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మహాలక్ష్మి, ఆరోగ్యశ్రీ పథకాలను ప్రారంభించారు. అనంతరం మహిళలతో కలిసి కొద్దిదూరం బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి చార్జీలు లేకుండా మహిళలు రాష్ట్రమంతా బస్సుల్లో ప్రయాణించవచ్చని చెప్పారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.10 లక్షల వరకు పెంచామని, ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందుతుందన్నారు.
అందోల్, డిసెంబర్ 10: ఎన్నికల మ్యానిఫెస్టోలో చెప్పిన విధంగా ఆరు మాసాల్లో ఆరుగ్యారెంటీలు అమలు చేస్తామని వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా అన్నారు. జోగిపేట బస్టాప్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి, ప్రయాణికులతో కలిసి కొద్దిదూరం ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మహాలక్ష్మి పథకం ఎంతో గొప్పగా ఉన్నదన్నారు. మహిళలు ఎలాంటి చార్జీలు లేకుండా రాష్ట్రమంతా పర్యటించవచ్చని చెప్పారు. ఆరోగ్యశ్రీ పథకం కవరేజీని రెట్టింపు చేశామని, ఇకపై ప్రతి పేదవాడికి రూ.10 లక్షల వరకు ఉచిత వైద్యం అందుతుందన్నారు. నియోజకవర్గంలో త్వరలో మరొక 50 పడకల దవాఖాన నిర్మించనున్నామని, దీనిద్వారా ప్రజలకు మ రింత నాణ్యమైన వైద్య సేవలు అందిస్తామన్నారు.
అందోల్ నియోజకవర్గం అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేస్తానని, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానన్నారు. కార్యక్రమంలో సం గారెడ్డి కలెక్టర్ శరత్, సీఈవో ఎల్లయ్య, మెప్మా పీడీ గీత, ఎంపీడీవో సత్యనారాయణ, ఆర్టీసీ ఆర్ఎం ప్రభులత, మేనేజర్ ఉపేందర్, ఆర్డీవో పాండు, మున్సిపల్ కమిషనర్ తిరుపతి, పార్టీ రాష్ట్ర నాయకురాలు త్రిష, మున్సిపల్ చైర్మన్ మల్లయ్య, కౌన్సిలర్లు సురేందర్‌గౌడ్, శివశంక ర్, సత్యనారాయణ, హరికృష్ణగౌడ్, రంగసురే శ్, రేఖప్రవీణ్, నాగరాజు, దుర్గేశ్, ఛందర్నాయక్, జడ్పీటీసీలు రమేశ్, అపర్ణ, పీఏసీఎస్ చై ర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీలు వెంకటే శం, రమేశ్‌గౌడ్, నాయకులు సార శివకుమార్, ప్రదీప్‌గౌడ్, మల్లప్ప, ప్రవీణ్ పాల్గొన్నారు.