మాయంపేట, సెప్టెంబర్ 30: సీఎం కేసీఆర్ పాలనలో రాష్ర్టాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తూ దేశంలోనే తెలంగాణను నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం రామాయంపేటలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆటో, ప్లంబర్, ఎలక్ట్రీషియన్ యూనియన్ సంఘాల నాయకులు బీఆర్ఎస్కు మద్దతు పలుకుతూ తీర్మానాలు చేసి ఎమ్మెల్యేకు అందజేసి, గులాబీ పార్టీలో చేరారు. వారందరికీ, అక్కన్నపేట కాంగ్రెస్, బీజేపీలకు చెందిన రజక సంఘం మహిళలకు ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలను అందిస్తున్నారన్నారు. కాంగ్రెస్ నాయకులు ఓట్ల కోసమే ప్రజల వద్దకు వస్తారు తప్ప ఎన్నికల తర్వాత కనుచూపు మేరలో కూడా కనిపించరన్నారు. 70 ఏండ్లలో లేని అభివృద్ధిని సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్లలో చేసి చూపించారన్నారు. రామాయంపేటలో వివిధ సంఘాలు బీఆర్ఎస్లో చేరడం, మద్దతు పలుకడం సంతోషంగా ఉన్నదని, ఇంతే ఉత్సాహంతో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పని చేయాలని పిలుపునిచ్చారు.
ముస్లిం మైనార్టీల సమస్యలు పరిష్కరిస్తా..
ముస్లిం మైనార్టీల సమస్యలను పరిష్కరిస్తానని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. శనివారం నిర్వహించిన సమావేశంలో ముస్లింలు ఖబరస్తాన్ స్థలం కోసం రామాయంపేటలో మూడు ఎకరాలను కేటాయించాలని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మీ న్యాయమైన కోరికలను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం ముస్లింలు శాలువాతో ఎమ్మెల్యేను సన్మానించారు. కార్యక్రమంలో రామాయంపేట మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి, పీఏసీఎస్ చైర్మన్ బాదె చంద్రం, సరాఫ్ యాదగిరి, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు, కౌన్సిలర్ గజవాడ నాగరాజు, దేమె యాదగిరి, కో ఆప్షన్ సభ్యులు పాతూరి ప్రభావతి, బాలుగౌడ్, హైమద్, అస్నొద్దీన్, బీఆర్ఎస్ నాయకులు దేవుని రాజు, కొండల్‌రెడ్డి, కేకే గౌడ్, డైరెక్టర్లు చింతల రాములు, మర్కు దత్తు, గణేశ్, బచ్చరాజుపల్లి మల్లేశం, రమేశ్ తదితరులున్నారు.