సిద్దిపేట, అక్టోబర్ 28: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్‌లో మృతిచెందారు. హరీశ్‌రావుకు పితృవియోగం జరిగిన విషయం తెలియగానే ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివెళ్లారు. తన్నీరు సత్యనారాయణ భౌతికకాయంపై పూలమాలలు ఉంచి నివాళులర్పించి, హరీశ్‌రావును పరామర్శించారు. పార్టీలకతీతంగా నాయకులు, పార్టీల శ్రేణులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజలు అంత్యక్రియలకు హాజరయ్యారు. జిల్లా మంత్రులు పొన్నం ప్రభాకర్, దామోదర రాజనర్సింహ, వివేక్.. హరీశ్ రావును పరామర్శించారు. సిద్దిపేట నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ శ్రేణులు భారీగా తరలివెళ్లి హరీశ్‌రావును ఓదార్చారు.



Harishfather4


Harishfather7

