Attack | మెదక్ జిల్లా హవేళీఘనపూర్లో విద్యుత్ శాఖ, అటవీ శాఖ సిబ్బంది అధికారుల మధ్య తీవ్ర ఘర్షణ నెలకొంది. మా ఇష్టమే మా ఫారెస్ట్ ఇది అని ఓ అటవీ శాఖ అధికారి అంటుంటే చెట్ల కొమ్మల తొలగింపు విషయం గురించి విద్యుత్ శాఖ మాట్లాడుతుండగా.. దానికో ప్రొసీజర్ ఉంటదని అటవీ శాఖ అధికారి అంటున్నాడు.
నువ్వొక గవర్నమెంట్ ఆఫీసర్వా, గూండావా.. ఎక్స్ట్రా మాట్లాడుతున్నవ్ అంటూ ఒకరి మీదకు ఒకరు వెళ్లడం వీడియోలో చూడొచ్చు. చెట్ల కొమ్మల తొలగింపు విషయంలో రెండు డిపార్ట్మెంట్ల మధ్య మొదలైన గొడవ, మాట మాట పెరిగి రోడ్డుపై కొట్టుకునే వరకు వెళ్లింది.దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రేవంత్ సర్కార్లో శాఖల మధ్య సమన్వయం కరువైందా??
మెదక్, హవేళీఘనపూర్లో విద్యుత్ శాఖ మరియు అటవీ శాఖ సిబ్బంది అధికారుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది.
చెట్ల కొమ్మల తొలగింపు విషయంలో మొదలైన గొడవ, మాట మాట పెరిగి రోడ్డుపై కొట్టుకునే వరకు వెళ్లింది. pic.twitter.com/HtPXjWbdVm
— Telugu Scribe (@TeluguScribe) June 13, 2026