నర్సాపూర్, జూలై12 : కొండపోచమ్మ సాగర్ నుంచి సంగారెడ్డి వరకు చేపట్టనున్న కాళేశ్వరం కెనాల్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులకు భూమికి బదులు భూ మి ఇవ్వాలని నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు. భూములు కోల్పోతున్న రైతులు శుక్రవారం నర్సాపూర్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తాలో రిలే నిరాహార దీక్ష చేశారు. ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి వారి కి సంఘీభావంగా దీక్షలో కూర్చుని మద్దతు తెలిపారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. కాలువ కోసం భూములు కోల్పోతున్న రైతులకు మార్కెట్ ధర ప్రకారం నష్ట పరిహారాన్ని చెల్లించాలని, లేదా భూమికి బదులు భూములు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుల నోట్లో మట్టి కొట్టేలా ప్రభు త్వం వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. రైతులకు న్యాయంగా రావాల్సిన పరిహారాన్ని చెల్లించాలని కోరారు. ప్రభుత్వంలో ఉన్న లేకున్నా బీఆర్ఎస్ రైతుల పక్షాన పోరాడుతుందని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్‌గౌడ్, వైస్ చైర్మన్ నయీమొద్దీన్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, రైతు సంఘాల నాయకులు మైసయ్య యాదవ్, రైతులు ప్యాట మహేశ్, రామకృష్ణ, శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.