అక్కన్నపేట, జూలై 30 : మండలంలోని కేశవాపూర్ పరిధిలోని రామలింగేశ్వరస్వామి గుట్టపై వీరబ్రహ్మేంద్ర స్వామి పేరిట భూమిని అదే గ్రామానికి చెందిన కందారపు రమేశచార్యులు స్వాహా చేశారని గ్రామస్తులు అరోపిస్తున్నారు. అధ్యాత్మికం పేరిట అవినీతి, అక్రమాలకు పాల్పడుతూ పబ్బం గడుపుకొంటున్న రమేశచార్యులు పూజా కార్యక్రమాల పేరిట వసూళ్ల దందా పాల్పడుతున్నారని పలువురు పేర్కొంటున్నారు.
గతంలో పలు అవినీతి, అక్రమాలు ఎదుర్కొంటున్న రమేశ చార్యులు తాజాగా కుల దైవం వీరబ్రహ్మేంద్ర స్వామి పేరిట కార్యకలాపాలు సాగిస్తున్నారు. అక్కన్నపేట తహసీల్ధార్ సంజీవ్ కుమార్ హయాంలో దేవుడి పేరి రామలింగేశ్వరస్వామి గుట్టపై 20 గుంటల భూమిని కేటాయించాలని కోరుతూ దరఖాస్తు చేసుకున్నాడనీ, తానే గుడికి వ్యవస్థాపకుడికినని పేర్కొన్నారు. దీంతో నమ్మిన రెవెన్యూ అధికారులు రమేశచార్యుల పేరిట 20 గుంటల భూమిని పట్టా చేసినట్లు సమాచారం తెలిసింది.
కాగా, ఈ విషయంపై తహసీల్దార్ అనంతర్రెడ్డి వివరణ కోరగా, తాను ఇటీవల విధుల్లో చేరాననీ, ఆ భూముల విషయంలో విచారణ చేపడుతామని పేర్కొన్నారు. చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. రమేశ చార్యులు వివరణ కోర గా, తాను వీరబ్రహ్మేంద్ర స్వామి పేరిట భూమిని పట్టా చేయాలని కోరిన విష యం నిజమేనన్నారు. అందుకు దరఖాస్తు కూడా చేశానని, గ్రామానికి చెందిన కొందరు వ్యక్తిగత ఆరోపణలు చేస్తున్నారన్నారు. రెవె న్యూ అధికారులు విచారణ చేపడితే చట్టపర చర్యలకు తాము సిద్ధ్దమని పేర్కొన్నారు.