జహీరాబాద్, అక్టోబర్ 23: నిమ్జ్ ప్రాజెక్టు కోసం సేకరించే భూములకు బదులు భూమిలివ్వాలని, లేదా బహిరంగ మార్కెట్ ధర ప్రకా రం పరిహారం చెల్లిస్తేనే భూములు ఇస్తామని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం గణేశ్‌పూర్ రైతులు స్పష్టం చేశారు. బుధవారం గ్రా మంలో నిమ్జ్ ప్రాజెక్టు కోసం భూమి సేకరించే రైతులతో జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ నాగలక్ష్మి, జహీరాబాద్ అర్డీవో రాజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిమ్జ్ ప్రాజెక్టులో పారిశ్రమల ఏర్పాటుతో నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుందన్నారు.
నిమ్జ్ ప్రాజెక్టు కోసం గ్రామంలో 566 ఎకరాల భూ ములు సేకరించాల్సి ఉందన్నారు. ఇప్పటికే 417 ఎకరాల భూమిని నిమ్జ్ కోసం సేకరించామన్నారు. మండలంలోని గ్రామాల్లో 149 మం ది రైతులు నిమ్జ్‌కు భూములు ఇవ్వాల్సి ఉందన్నారు. ఎకరాకు రూ. 15 లక్షల పరిహారం చెల్లిస్తామన్నారు. రెండు, మూడు పంటలు పం డించే పట్టా భూములను అంత తక్కువ పరిహారానికి ఇవ్వమని రైతు లు పేర్కొన్నారు. రైతుల న్యాయమైన డిమాండ్లను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్తామని అధికారులు తెలిపారు. సమావేశంలో మండల తహసీల్దార్ భూపాల్, డిప్యూటీ తహసీల్దార్ రాజిరెడ్డి,ఆర్ఐ శామ్‌రావు, రైతులు పాల్గొన్నారు.