అందోల్, ఆగస్టు 9: సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వానికి రేషన్ డీలర్ల కుటుంబాలు ఎప్పటికీ రుణపడి ఉంటాయని రేషన్ డీలర్ల సంఘం అందోల్ మండలాధ్యక్షుడు మహేశ్ అన్నారు. బుధవారం జోగిపేట తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో రేషన్ డీలర్లు సీఎం కేసీఆర్‌కు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మహేశ్ మాట్లాడుతూ చాలీచాలని కమీషన్లతో కాలం నెట్టుకొస్తున్న రేషన్ డీలర్ల సమస్యలు గుర్తించిన సీఎం కేసీఆర్ కమీషన్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం ఎంతోషంగా ఉందన్నారు.
అదేవిధంగా డీలర్లకు బీమా, రెన్యువల్ 5 ఏండ్లకు పెంచడం, డీలర్లు చనిపోతే అంత్యక్రియలకు రూ.10వేలు అందించడం, ఎంఎల్ఎస్ పాయింట్ల వద్ద వే బ్రిడ్జిల ఏర్పాటు, హెల్త్‌కార్డుల జారీ ఇలా ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నందుకు ముఖ్యమంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం తహసీల్ కార్యాలయంలో డీటీ మధుకర్‌రెడ్డి, సిబ్బందిని స్వీట్లు తినిపించారు. కార్యక్రమంలో మండలం రేషన్ డీలర్లు, సంఘం నాయకులు పాల్గొన్నారు.