న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: అమెరికాకు చెందిన వాహన సంస్థల ధరలు భారీగా తగ్గబోతున్నాయి. భారత్-అమెరికా దేశాల మధ్య ఎట్టకేలకు మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరడమే ఇందుకు కారణం. ఇందులో భాగంగా అమెరికాకు చెందిన మోటర్ సైకిళ్ల తయారీ సంస్థ హార్లే డేవిడ్సన్కు చెందిన బైకులు మరింత చౌకగానున్నాయి. 800-1,600 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన మోటర్ సైకిళ్లపై ఎలాంటి సుంకాలు ఉండబోవని అధికార వర్గాలు ప్రకటించడంతో ఈ వాహన ధరలు తగ్గనున్నాయని హార్లే డేవిడ్సన్ ప్రకటించింది.
1,600 సీసీ ఇంజిన్ సామర్థ్యం కలిగిన వాహన దిగుమతులపై 50 శాతంగా ఉన్న దిగుమతి సుంకాన్ని గతేడాది 40 శాతానికి తగ్గించారు. 1,600 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన వాహనాలపై 50 శాతం సుంకాన్ని 30 శాతానికి దించా రు. దేశీయ మార్కె ట్లో తన వాహనాలను విక్రయించడానికి 2020లో హీరో మోటోకార్ప్‌తో హార్లీ డేవిడ్సన్ ఒప్పందం కుదుర్చుకున్నది.