దుబ్బాక, జనవరి 22: కూడవెల్లి రామలింగేశ్వరాలయ జాతరకు అన్ని ఏర్పాట్లు చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి సూచించారు. బుధవారం అక్బర్పేట-భూంపల్లి మండలం కూడవెల్లి రామలింగేశ్వరాలయాన్ని రాష్ట్ర ఎస్సీ,ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన దర్శించుకుని పూజలు చేశారు.ఈనెల 28 నుంచి మాఘ అమావ్యాస సందర్భంగా వారం పాటు జరిగే జాతర ఏర్పాట్లపై దేవాదాయ, పోలీసు అధికారులు, ఆలయ అర్చకులతో సమీక్షించారు.
కూడవెల్లిలో స్నానాలు ఆచరించే భక్తులు ప్రమాదాల బారినపండా రక్షణ చర్యలు చేపట్టాలని, గజ ఈతగాళ్లతో పాటు వాగుకు ఇరువైపులా వలలను ఏర్పాటు చేయాలని సూచించారు. వారి వెంట బీఆర్ఎస్ నాయకులు నగరం రవి, కిషన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, చింతల కృష్ణ తదితరులు ఉన్నారు. పోతారం గ్రామంలో బుధవారం సిద్దిపేట లోహిత్ సాయి దవాఖాన ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఎమ్మెల్యే ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు.
ఉచిత వైద్య శిబిరం నిర్వహించినందుకు లోహిత్ సాయి వైద్యబృందాన్ని ఆయన అభినందించారు. ఆనంతరం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు తాగునీటి ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించి విద్యార్థులకు స్టీల్ బాటిల్స్‌ను పంపిణీ చేశారు. ఆ తర్వాత దుబ్బాక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గంలో 131 మంది బాధితులకు రూ.30 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు.