ఓటర్లు ఆలోచించి ఓటువేయాలి
దుబ్బాక అభివృద్ధి కోసం పట్టణ ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి ఓటువేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు.
- మాయగాళ్ల మాటలు నమ్మి మోసపోవద్దు
- దుబ్బాక అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించాలి
- కేసీఆర్‌తోనే రైతులకు సాగునీరు.. పేదలకు సంక్షేమం
- ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి
దుబ్బాక,ఫిబ్రవరి 9 : దుబ్బాక అభివృద్ధి కోసం పట్టణ ప్రజలంతా ఒక్కసారి ఆలోచించి ఓటువేయాలని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేందుకు కారు గుర్తుకు ఓటువేయాలని కోరారు. దుబ్బాక మున్సిపల్ ఎన్నికల నేపథ్యంతో సోమవారం రాత్రి ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్తోనే దుబ్బాక ము న్సిపల్ అభివృద్ధి సాధ్యమన్నారు. రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో దుబ్బాక అభివృద్ధి జరగలేదన్నారు. దుబ్బాక అంటే కేసీఆర్‌కు ఎంతో అభిమానం, ఆయన ప్రత్యేక చొరవతోనే అద్భుతమైన బాలాజీ దేవాలయం, కేసీఆర్ బడి , రామసముద్రం చెరువుకట్ట సుం దరీకరణ, వంద పడకల దవాఖాన , మో డల్ బస్టాండ్ భవనం నిర్మించుకున్నామని గుర్తుచేశారు.
మల్లన్నసాగర్ ప్రాజెక్టుతో నియోజకవర్గ రైతులకు సాగునీటి కష్టాలు తీర్చిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. దుబ్బాకలో చాలా మంది బీడీ, చేనే త, గీత కార్మికులు ఉన్నారని, వారందరికీ అండగా ఉంటూ ఆసరా పింఛన్లు మంజూరు చేశారని గుర్తు చేశారు. అభివృద్ధి, సంక్షేమానికి మారుపేరుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. బీజేపీ నా యకుల మాటలు నమ్మి మోసపోవద్దన్నారు. మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ నా యకులు ఎల్లారెడ్డి, శ్రీనివాస్, నరేశ్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

