తొగుట, ఆగస్టు 4: 78 ఏండ్ల స్వాతంత్య్ర భారతంలో నేటికీ విద్య, వైద్యం పేదలకు అందని ద్రాక్షగానే మారిందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా తొగుట మండలంలోని ఘనపూర్ ప్రభుత్వ పాఠశాలలో మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ మనుమలు, మనుమరాలు ఎండీ కరీమొద్దీన్, యాసినుద్దీన్, అయేషా సుల్తానా పుట్టినరోజులను పుర స్కరించుకొని విద్యార్థులకు బ్యాగులు సమకూర్చగా సోమవారం ఫరూఖ్ హుస్సేన్‌తో పాటు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి ఆయన పంపిణీ చేశారు.
ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రాజకీయాల్లోకి రాకముందే కేపీఆర్ ట్రస్టు ద్వారా సిద్దిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గంలోని పాఠశాలల్లో పుస్తకాలు, బ్యాగులు పంపిణీ చేసినట్లు తెలిపారు. నేడు సగటు వ్యక్తి సంపాదనలో అధికభాగం విద్య, ఆరోగ్యానికి కేటాయిస్తున్నప్పటికీ నాణ్యమైన విద్య అందడం లేదన్నారు. ప్రభుత్వాలు ఎన్నిమారినా విద్య, ఆరోగ్య వ్యవస్థలో మార్పు రావడం లేదన్నా రు.
ఘనపూర్‌లో 10 మందికి పైగా టీచర్లు ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండటం ఆందోళన కరమన్నారు. ప్రభుత్వ ఉద్యోగం రానివారే ప్రైవేట్ టీచర్లుగా పనిచేస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం కూడా ప్రైవేట్‌కు దీటుగా పాఠశాలలను అభివృద్ధి చేయాలన్నారు. మాజీ ఎమ్మెల్సీ ఫరూఖ్ హుస్సేన్ మాట్లాడుతూ పుట్టినరోజులను పురస్కరించు కొని పేద విద్యార్థుల కోసం మనుమలు, మనుమరాలు డబ్బులు ఖర్చు చేయడం సంతోషం గా ఉందన్నారు.
పాఠశాల హెచ్ఎం అంజలి ఎమ్మెల్యేతో పాటు అతిథులను సన్మానించారు. కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ హరికృష్ణారెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి, బీఆర్ఎస్ దుబ్బాక పట్టణ అధ్యక్షుడు వంశీకృష్ణాగౌడ్, నాయకులు చిలువేరి మల్లారెడ్డి, సికిందర్, కొమురయ్య, బోదనం కనకయ్య, శరత్, కలీమొద్దీన్, స్వామి, శేఖర్‌గౌడ్, మంగ నర్సింహులు, ఎల్లం, రాజిరెడ్డి, రాజశేఖర్, కిరణ్ కుమార్‌రెడ్డి, నరేందర్‌గౌడ్, రమేశ్, అక్కం స్వామి, బైరాగౌడ్, పులిరాజు, అశోక్, కనకయ్య, వెంకటేశ్, ప్రభాకర్‌రెడ్డి, రాజిరెడ్డి, యాదగిరి, బాలరాజు పాల్గొన్నారు.