మాటల్లో కాదు.. చేతల్లో చూపించాలి
సంగారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఉత్తమాటలు కాకుండా నిధులు మంజూరు చేసి చూపించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు డిమాం డ్ చేశారు. శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
- హామీల అమలులో సీఎం రేవంత్‌రెడ్డి విఫలం
- జహీరాబాద్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి
- విలేకరుల సమావేశంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు డిమాండ్
జహీరాబాద్, ఆగస్టు 14: సంగారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఉత్తమాటలు కాకుండా నిధులు మంజూరు చేసి చూపించాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు డిమాం డ్ చేశారు. శుక్రవారం సాయంత్రం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధే తప్పా కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి శూన్యమన్నారు. బీఆర్ఎస్ హయాంలో రోడ్ల అభివృద్ధి కోసం పంచాయతీరాజ్ శాఖ ద్వారా రూ 73కోట్లు, ఆర్‌అండ్‌బీశాఖ ద్వారా రూ 30కోట్లు మంజూరు చేసిన నిధులను ప్రభుత్వం నిలిపివేసిందని ఆరోపించారు.
జహీరాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి రూ.50కోట్లు మంజూరు చేయగా, రూ. 25 కోట్ల మేరకు అభివృద్ధి పనులు పూర్తిచేసినట్లు తెలిపారు. మిగిలిన రూ. 25 కోట్లను కూడా ప్రభుత్వం నిలిపివేయడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మూడున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. నియోజకవర్గంలోని ఆయా మండలాల్లో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశా రు. జహీరాబాద్ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించేందుకు బీఆర్ఎస్ పాలనలో చేపట్టిన సంగమేశ్వర ప్రాజెక్టును వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇటీవల జహీరాబాద్ ప్రాంత అభివృద్ధి పనులు, పలు సమస్యలు పరిష్కరించాలని ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రులకు కలిసి వినతి పత్రాలు అందిస్తే వెంటనే వాటిని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పడం సంతోషంగా ఉందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో జహీరాబాద్ ప్రాంత సమస్యలు ప్రస్తావించినప్పుడల్లా సంబంధిత అధికారులు నోట్ చేసుకుంటామని సంబంధిత మంత్రులు సమాధానం చెప్పడం బాధాకరమన్నారు. సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ మాజీ చైర్మన్ శివకుమార్, బీఆర్ఎస్ మండల అధ్యక్షులు తట్టునారాయణ, నర్సింహులు, సంజీవ్‌రెడ్డి, వెంకటేశం, కౌన్సిలర్లు దీపక్, మహిపాల్, ప్రవీణ్, నాయకులు గండప్ప, విజయ్‌కుమార్, నరసింహగౌడ్, సురేశ్, శివప్ప పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Akhilesh Yadav | అఖిలేష్ యాదవ్‌కు షాక్.. బీజేపీలో చేరిన ఎస్పీ రెబల్ ఎమ్మెల్యేలు
Prabhas | ‘కల్కి 2’ సెట్స్‌లోకి రెబల్ స్టార్ ప్రభాస్.. త్వరలో ప్రారంభం కానున్న భారీ షెడ్యూల్!
రైతుల వ్యథలు పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
‘రేషన్ షాపుల ద్వారా 14 రకాల నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలి’
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

