చేర్యాల, జనవరి 30 : సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లికార్జున స్వామి లష్కర్ వారం ఆదాయం రూ.59,71, 343 వచ్చినట్లు ఆలయ ఈవో ఎ.బాలాజీ, పునరుద్ధరణ కమిటీ చైర్మన్ పర్పాటకం లక్ష్మారెడ్డి తెలిపారు. ఆర్జీత సేవలు, గదులు, దర్శనాలు, ప్రసాదాల విక్రయం తదితర వాటి ద్వారా శనివారం రూ.5,97, 344, ఆదివారం రూ.45,22,202, సోమవారం రూ.8, 51,797 ఆదాయం వచ్చిందన్నారు.
గతేడాదితో పోలిస్తే ఈసారి రూ,20,93,123 అదనంగా ఆదాయం వచ్చిందన్నారు. సమావేశంలో ఆలయ ఏఈవో గంగా శ్రీనివాస్, సూపరింటెండెంట్ నీల శేఖర్, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్,కమిటీ సభ్యులు, అర్చకులు, ఒగ్గు పూజారులు ఉన్నారు.