Ketaki Sangameshwar | ఝరాసంగం, మే 3: దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం గత ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన షవర్లు అధికారుల నిర్వహణ లోపంతో అస్తవ్యస్తంగా మారాయి. దేవాలయ ఆవరణలోని వాలాద్రి వాగు పక్కన భక్తుల స్నానాల కోసం ఏర్పాటు చేసిన షవర్లపై భక్తులు బట్టలు ఆరవేస్తున్న దృశ్యం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. స్థానిక భక్తులు, సందర్శకులు దేవాలయ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. షవర్లను సరిగ్గా నిర్వహించకపోవడం వల్ల భక్తులు తమ బట్టలను ఇక్కడే ఆరవేయాల్సి వస్తోంది. దేవాలయ అధికారులు ఈ సమస్యపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, షవర్ల నిర్వహణతో పాటు భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.