Chalo Warangal | పటాన్చెరు రూరల్, ఏప్రిల్ 20 : బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పార్టీ శ్రేణులంతా సన్నద్ధమవుతున్నారు. ఈ నెల 27 వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చేలా ప్రచార కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. రుద్రారం గ్రామంలో ఇవాళ బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఛలో వరంగల్ రజతోత్సవ బహిరంగ సభ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ నెల 27 వరంగల్‌లో జరిగే బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు పోస్టర్లతో ప్రచారం చేస్తున్నామని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు అన్నారు. ఉద్యమ నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ జనం గొంతుకగా మారి రజతోత్సవ సభ మాట్లాడుతారని వారు వివరించారు. కాంగ్రెస్ పార్టీ పాలన నుంచి నష్టపోయినవారు ఈ సభకు వచ్చేందుకు ముందుకు వస్తున్నారన్నారు.
వరంగల్ సభను విజయవంతం చేసేందుకు రుద్రారం నుంచి బీఆర్ఎస్ అభిమానులను, ప్రజలను తరలిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు వెంకట్, నవీన్‌గౌడ్, నరేశ్, ఖలీల్, శ్రీను, సంతు, రాకేశ్ తదితరులు పాల్గొన్నారు.
CC cameras | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
Indigo flight | విమానాన్ని ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?