గజ్వేల్, నవంబర్ 23: గజ్వేల్ పట్టణానికి చెందిన ప్రశాంత్ జాతీయస్థాయి క్రికెట్ బీ టీంకు తెలంగాణ నుంచి ఎంపికయ్యాడు.
చాలెంజర్ ట్రోఫీ 24లో ఆడుతున్న ప్రశాంత్ శనివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఎర్రవల్లిలోని ఆయన వ్యవసాయ క్షేత్రం లో కలిశాడు. ఈ సందర్భంగా ప్రశాంత్‌ను కేసీఆర్ శాలువాతో సన్మానించి అభినందించారు.