మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామం నేడు అన్నిరంగాల్లో ఆదర్శంగా నిలుస్తున్నది. సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల క్రితం ఈ గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి గ్రామ రూపురేఖలే పూర్తిగా మారిపోయాయి. గ్రామస్థాయి నుంచి జాతీయస్థాయి వరకు అభివృద్ధిలో ప్రత్యేక ముద్ర వేసుకున్నది. రాష్ట్ర స్థాయిలో గ్రామ్ ఊర్జా స్వరాజ్ పురస్కార్‌కు ఎంపికైంది. కార్యదర్శితో కలిసి సర్పంచ్ భాగ్యాభిక్షపతి మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావు చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. మరో తొమ్మిది విభాగాల్లో మండల, జిల్లా స్థాయిలో రెండు అవార్డులు సొంతం చేసుకోగా మంత్రి హరీశ్‌రావు నుంచి తీసుకున్నారు. ఇటీవల దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయత్ సతత్ వికాస్ పురస్కార్ బృందం గ్రామంలో పర్యటించింది. అభివృద్ధి పనులు పరిశీలించి పురస్కారానికి ఎంపిక చేసింది. గ్రామస్తులు హర్షం వ్యక్తం చేయడంతో పాటు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు.
మర్కూక్, ఏప్రిల్ 7: సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి నేడు అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుస్తోంది. పాలకవర్గం సమన్వయంతో పనిచేయడం వల్ల దీన్‌దయాళ్ ఉపాధ్యాయ పంచాయతీ వికాస్ పురస్కారాలు అందుకునేలా చేసింది. రాష్ట్రస్థాయిలో గ్రామ్ ఉర్జా స్వరాజ్ పురస్కార్‌కు ఎంపికైంది. ఇటీవల మంత్రులు కేటీఆర్, దయాకర్‌రావు చేతుల మీదుగా కార్యదర్శితో కలిసి సర్పంచ్ అవార్డు అందుకున్నది. తొమ్మిది విభాగాల్లో మండలస్థాయి, జిల్లా స్థాయిలో రెండు అవార్డులు సొంతం చేసుకుంది. రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా సర్పంచ్ తోపాటు కార్యదర్శి అవార్డు అందుకుని మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలిచింది. గతంలో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవార్డులు సాధించింది. వికాస్ పురస్కార్ అవార్డులో జిల్లాలో రెండు విభాగాల్లో ప్రథమస్థానంలో ఎర్రవల్లి నిలిచింది.
ఎనిదేండ్ల క్రితం సీఎం కేసీఆర్ దత్తత
మర్కూక్ మండలంలోని ఎర్రవల్లి గ్రామాన్ని సీఎం కేసీఆర్ ఎనిమిదేండ్ల క్రితం దత్తత తీసుకున్నారు. అప్పటి నుంచి గ్రామ రూపురేఖలే పూర్తిగా మారాయి. గ్రామ స్థాయి నుంచి దేశస్థాయి వరకు అభివృద్ధిలో ప్రత్యేక ముద్ర వేసుకుంది. ఇటీవల దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వికాస్ పురస్కార్ బృందం గ్రామంలో పర్యటించి అభివృద్ధి పనులు పరిశీలించింది. తొమ్మిది విభాగాల్లో అభివృద్ధిని పరిశీలించి సతత్ వికాస్ పురస్కార్‌కు ఎర్రవల్లి ఎంపికచేసింది. మండల స్థాయిలో క్లీన్ అండ్ గ్రీన్పాటు జిల్లా స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచింది. ఇటీవల అవార్డును మంత్రి చేతుల మీదుగా కార్యదర్శితో కలిసి ఎర్రవల్లి సర్పంచ్ అందుకున్నారు.
తాగునీటి సమస్య లేదు
గ్రామంలో ప్రతి ఇంటికీ నీరు అందించే విధంగా గ్రామంలో లక్షా 20 వేల లీటర్ల ట్యాంకు, 40వేల ట్యాంక్‌లు నిర్మించారు. ప్రస్తుతం మరో 40 వేల లీట ర్ల ట్యాంకు నిర్మాణంలో ఉంది. దీంతో గ్రామంలో ప్రజలకు తాగునీటి సమస్య లేకుండా పోయింది.
సోలార్ వినియోగంపై…
గ్రామానికి మరో రాష్ట్రస్థాయి అవార్డు లభించింది. 2021-22 సంవత్సరానికి ఎర్రవల్లి గ్రామ పంచాయతీ సోలార్ వినియోగంపై రాష్ట్రస్థాయి గ్రామ్ ఉర్జ స్వరాజ్ విశేష్ పంచాయతీ పురస్కారానికి ఎంపికైంది. గ్రామంలో ప్రతి ఇంట్లో సోలార్‌ను వినియోగిస్తున్నారు. ఈ ప్రాజెక్టులో ఒక్కో యూనిట్‌కు కిలో వాట్ విద్యుత్ ఉత్పత్తి అవుతున్నది. ఒక్కో యూనిట్ లక్షా 57 వేలు ఖర్చు కాగా ఇందులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 90వేల సబ్సిడీ ఇవ్వగా సీఎస్ఆర్ ఫండ్ ద్వా రా బీహెచ్ఈఎల్ సహకారంతో రూ. 60 వేల రూపాయలు ఇచ్చారు.దీంతో కేవలం ఏడువేలు ఇంటి యజమాని తన వాటాగా చెల్లించారు. గ్రామంలో 519 ఇండ్లకు 414 ఇండ్లకు సోలాల్ వాడుతున్నారు.
ఊరంతా పచ్చదనం…
ఎర్రవల్లిలో ఏ వాడ చూసినా పచ్చదనం కనిపిస్తోంది. రోడ్లకు ఇరువైపులా హరితహారంలో నాటిన మొక్కలు నేడు ఏపుగా పెరిగి పచ్చదనం పరుచుకుంది. విశాలమైన రోడ్లు, ఆహ్లాదం పంచే తీరొక్క పూల మొక్కలు పెంచారు. గ్రామంలో సుమారు 400 వందల ఇంకుడు గుంతలు నిర్మించారు. ఇంట్లో వాడుకునే నీరు బయటకు రాకుండా ఇంకుడు గుంతల్లోనే చేరి గ్రామంలో భూగర్భ జలాల పెంపునకు దోహపడుతుంది. రోడ్లపై ఎక్కడ కూడా మురుగు సమస్య లేదు. చెత్తను సేకరించి డంపింగ్‌యార్డులో కంపోస్టు ఎరువును తయారు చేసి గ్రామంలో నాటిన మొక్కలకు వాడుకుంటున్నారు. దీంతో చెట్లు ఏపుగా పెరిగి గ్రామస్తులకు, బాటసారులకు నీడనిస్తున్నాయి.
గ్రామస్తుల సహకారంతోనే..
సోలార్ వాడకంతో రాష్ట్రస్థాయిలో గ్రామ్ ఉర్జా స్వరాజ్ విశేష్ పంచాయతీ రాష్ట్రస్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉంది. దీన్‌దయాళ్ ఉపాధ్యాయ వికాస్ పురస్కార్‌లో రెండు అవార్డులు సాధించడం ఆనందంగా ఉంది. గ్రామస్తుల ఐక్యత, సహకారంతోనే అవార్డులు వచ్చాయి. ఈ అవార్డులు ప్రజలకే అంకింతం చేస్తున్నాం. సీఎం కేసీఆర్ మా గ్రామాన్ని దత్తత తీసుకోవడంతోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాం. సీఎం స్ఫూర్తితోనే అభివృద్ధిలో ముందుకు పోతున్నాం. ఎర్రవల్లిని ప్రగతివల్లిగా మార్చుకున్నాం.
– భాగ్యాభిక్షపతి, సర్పంచ్, ఎర్రవల్లి
పంచాయతీలకు పెద్దపీట..
సీఎం కేసీఆర్ నేతృత్వంలో గ్రామ పంచాయతీలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్నాయి. గతంలో పల్లెలు అభివృద్ధికి నోచుకోలేదు. సీఎం కేసీఆర్, తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత పల్లెలు ప్రగతి బాట పట్టాయి. సీఎం కేసీఆర్ దత్తత గ్రామమైన ఎర్రవల్లి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు సొంతం చేసుకుంది. ఎర్రవల్లి నేడు ఇతర గ్రామాలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. సీఎం కేసీఆర్, మంత్రి
హరీశ్‌రావు సూచనలతో రాష్ర్టానికే ఆదర్శంగా నిలువడం సంతోషంగా ఉంది. – మంగమ్మ, జడ్పీటీసీ, మర్కూక్