పెద్దశంకరంపేట, జనవరి 12 : ఈ నెల 18 నుంచి ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని నారాయణఖేడ్ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి అన్నారు. గురువారం రైతువేదికలో వైద్య సిబ్బందితో ఏర్పాటు చేసిన అవగాహన సమావేశంలో మాట్లాడారు. ఏఎన్ఎంలు, వైద్య సిబ్బంది ఇంటింటికీ తిరుగుతూ కంటి వెలుగుపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కంటి సమస్యలు ఉన్నవారిని గుర్తించి, సరైన చికిత్స అందించాలని సూచించారు. విధుల్లో కంటి వెలుగు ఉన్నవారి సమస్యలను గుర్తించి వైద్య శిబిరం వైద్య సిబ్బంది నిర్లక్ష్యం వహించవద్దన్నారు. గతంలో జరిగిన సమస్యలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ లక్ష్మీరమేశ్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, ఎంపీటీసీ వీణాసుభాశ్గౌడ్, రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు సురేశ్‌గౌడ్, ఎంపీడీవో రఫీకున్నీసా, మండల వైద్యాధికారి సారిక ఉన్నారు.
‘కంటి వెలుగు’ విజయవంతం చేయాలి: ‘గడా’ ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి
రెండో విడుత కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ(గడా) అధికారి ముత్యంరెడ్డి అన్నారు. తూ ప్రాన్ మండల పరిషత్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ‘కంటి వెలుగు’పై ఏర్పాటు చేసిన అవగాహనా కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కంటి వెలుగు విజయవంతానికి అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో కలిసి పనిచేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వప్న, తూప్రాన్ ఆర్డీవో శ్యాంప్రకాష్, ఎంపీడీవో అరుంధతి, డాక్టర్ జ్యోత్స్నాదేవి పాల్గొన్నారు.
తూప్రాన్ మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో వైద్య సిబ్బందితో మున్సిపల్ చైర్మన్ రాఘవేందర్‌గౌడ్ ఆధ్వర్యంలో కంటి వెలుగుపై అవగాహన సదస్సు నిర్వహించారు. అంధత్వ రహిత తెలంగాణే లక్ష్యంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో మున్సిపల్ కమిషనర్ మోహన్, మెడికల్ ఆఫీసర్ జ్యోత్స్నాదేవి, సీహెచ్‌వో బాల్‌నర్సయ్య, ఎంపీహెచ్వో శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
ఉచితంగా కంటి పరీక్షలు, అద్దాల అందజేస్తాం..
‘కంటి వెలుగు’ విజయవంతానికి సమష్టిగా కృషి చేయాలని మెదక్ ఎంపీపీ యమునా, ఎంపీడివో శ్రీరాములు అన్నారు. మెదక్ ఎంపీడీవో కార్యాలయం లో కంటివెలుగుపై సమవేశం నిర్వహించారు. కంటి వెలుగు కార్యక్రమం ఈ నెల 18వ తేదీ నుంచి 100 రోజుల వరకు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరికీ కంటి పరీక్షలు నిర్వహించి, ఉచితంగా కంటి అద్దాలు, మందులు అందజేస్తామని తెలిపారు. సమావేశంలో పీఎసీఎస్ చైర్మన్ హన్మంత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ మార్గం ఆంజనేయులు, వైద్యాధికారి, సర్పంచ్‌లు, నర్సింహులు, సిద్ధాగౌడ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
జూన్ 28 వరకు గ్రామాల్లో శిబిరాలు
నిజాంపేటలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో ఎంపీపీ సిద్ధిరాములు సమీక్ష నిర్వహించారు. మండలంలో 14 కంటి వెలుగు శిబిరాలను ఏర్పా టు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో డీ.ధర్మారం పీహెచ్సీ వైద్యురాలు హరిప్రియ, ఎంపీడీవో వెంకటలక్ష్మి, సర్పంచ్‌లు అనూష, ప్రీతి, అమరసేనారెడ్డి, ఎంపీటీసీలు లహరి, బాల్‌రెడ్డి, సురేశ్, మండల కో ఆప్షన్ సభ్యుడు గౌస్, ఎంపీవో రాజేందర్, ఏపీవో శ్రీనివాస్, హెల్త్ సూపర్వైజర్లు ఉజ్వలరాణి, శ్యామల పాల్గొన్నారు.
నేడు ‘కంటి వెలుగు’పై అధికారులతో సమీక్ష
వెల్దుర్తి ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటలకు అవగాహన సదస్సు నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో జగదీశ్వరాచారి తెలిపారు. ఈ నెల 18 నుంచి జూన్ 28 వరకు కంటివెలుగు శిబిరాలను జనాభా ప్రతిపాదికన ఏర్పా టు చేసి, ప్రజలందరికీ కంటి పరీక్షలను నిర్వహిస్తామన్నారు.
శిబిరాల వద్ద తగిన వసతులు కల్పించాలి
రేగోడ్ మండల ప్రజాపరిషత్‌లో కంటివెలుగు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ సరోజన, డాక్టర్ శ్వేత మాట్లాడుతూ.. కంటి వెలుగు శిబిరాలకు స్థానిక ప్రజాప్రతినిధులు సహకరించాలన్నారు. శిబిరాల వద్ద ప్రజల కు పూర్తి వసతులు కల్పించాలని సూచించారు. సమావేశం లో ఎంపీడీవో సీతారావమ్మ, ఎంపీటీసీ నర్సింహులు, సర్పం చ్‌లు, వైద్యసిబ్బంది సిద్దప్ప తదితరులు పాల్గొన్నారు.
వంద రోజుల వరకు ‘కంటి’ పరీక్షలు
చిలిపిచెడ్ మండలంలో వంద రోజులపాటు కంటి వెలుగు శిబిరాలను నిర్వహిస్తామని ఎంపీపీ వినోదాదుర్గారెడ్డి, డాక్టర్ సతీశ్ తెలిపారు. ఎంపీడీవో కార్యాలయంలో ప్రజాప్రతినిధు లు, కార్యదర్శులకు సమావేశం నిర్వహించారు. సమావేశం లో ఎంపీడీవో శశిప్రభ, మెడికల్ ఆఫీసర్ ప్రవీణ్, సర్పంచ్‌లు లక్ష్మీదుర్గారెడ్డి, గోపాల్‌రెడ్డి, బుజ్జిబాయి పాల్గొన్నారు.
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలి
ప్రతి ఒక్కరూ కంటి పరీక్షలు చేయించుకోవాలని పాపన్నపేట ఎంపీపీ చందనాప్రశాంత్‌రెడ్డి సూచించారు. పాపన్నపేటలో జరిగిన సమావేశం లో ఏపీడీ భీమయ్య, వైస్ ఎంపీపీ విష్ణువర్ధన్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.