నిజాంపేట, అక్టోబర్ 12 : అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం గద్దనెక్కిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, మెదక్ అసెంబ్లీ ఇన్చార్జి కాంటారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. నిజాంపేటలోని వంజర సంఘంలో మండల స్థాయి బీఆర్ఎస్ నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి ఎందుకే బాకీ కార్డులను పంపిణీ చేస్తున్నామన్నారు. బీఆర్ఎస్ సైనికులు ఈ బాకీ కార్డులను ఇంటింటికీ పంపిణీ చేయాలని దిశా నిర్దేశం చేశామన్నారు.
కార్యక్రమంలో మాజీ సర్పంచులు గోపరి నరసింహులు అరుణ్ కుమార్, మాజీ ఎంపీసీలు చింతల స్వామి బాల్రెడ్డి, కల్వకుంట, నిజాంపేట పిఎసిఎస్ చైర్మన్లు అందె కొండల్ రెడ్డి, బాపురెడ్డి, ఆయా గ్రామాల అధ్యక్షులు దుర్గయ్య నరేందర్, రజక సంఘం జిల్లా అధ్యక్షుడు సంఘ స్వామి, బిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మావురం రాజు, నాయకులు లచ్చపేట రాములు, మల్లేశం, సోమ్లా నాయక్, సుభాష్ నాయక్ ఎల్లం యాదవ్ తదితరులు ఉన్నారు