CITU | చిలిపిచెడ్, డిసెంబర్ 2: చిల్డ్రన్ పార్క్ వద్ద సీఐటీయూ రాష్ట్ర మహాసభల బహిరంగ సభ కరపత్రాన్ని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు విడుదల చేశారు. మంగళవారం మండలంలోని అజ్జమరి గ్రామంలో మాట్లాడుతూ..
మెదక్ పట్టణంలో జరిగే సీఐటీయూ 5వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ మెదక్ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు అన్నారు. మెదక్ పట్టణంలోని చిల్డ్రన్ పార్క్ వద్ద సీఐటీయూ రాష్ట్ర 5వ మహాసభల బహిరంగ సభ జయప్రదం చేయాలని కరపత్రాలు విడుదల చేయడం జరిగిందనీ అన్నారు.
ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు కడారి నాగరాజు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమవుతుందన్నారు. 4 లేబర్ కోడ్ లు తెచ్చి కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేస్తూ కార్మికులకు అన్యాయం చేస్తుందన్నారు. కార్మికులకు కనీస వేతనం 26,000/- అమలు చేయడం లేదన్నారు. కార్మికులకు పని భారం పెంచుతూ శ్రమను దోచుకుంటుందన్నారు.
ఉద్యోగ భద్రత, ఈఎస్ఐ, పీఎఫ్, కనీస సౌకర్యాలు అమలు చేయడం లేదన్నారు. కార్మికుల సమస్యలను చర్చించడానికి డిసెంబర్ 7,8,9 తేదీలలో మెదక్ పట్టణంలో జరిగే సీఐటీయూ 5వ రాష్ట్ర మహాసభలను నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటిరోజు 7వ తేదీన బహిరంగ సభ ఉంటుందన్నారు. 8,9 తేదీలలో రాష్ట్రంలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందిస్తామన్నారు. కావున ఈ మహాసభల విజయవంతానికి కార్మికులు, కర్షకులు, శ్రేయోభిలాషులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లేశం, శేఖర్, నర్సింలు, మల్లేశం పాల్గొన్నారు.
Sanchar Sathi App: సంచార్ సాథీ యాప్ను డిలీట్ చేసుకోవచ్చు.. క్లారిటీ ఇచ్చిన కేంద్ర మంత్రి సింథియా