ఝరాసంగం : మెదక్ జిల్లా ఝరాసంగం ( Jharasangam ) జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని( Alumni Reunion ) గురువారం ఘనంగా నిర్వహించారు. 1999-2000 విద్యాసంవత్సరంలో పదో తరగతి( Tenth Classs ) చదివిన పూర్వ విద్యార్థులంతా కలసి దాదాపు 26 ఏళ్ల తర్వాత సహచర విద్యార్థులంతా ఒకే వేదికపైకి చేరడంతో ఆ ప్రాంతంలో పండుగ వాతావరణం నెలకొంది.
ఒకరినొకరు పలకరించుకుంటూ, అలనాటి మధుర జ్ఞాపకాలను, పాఠశాల రోజుల్లోని ముచ్చట్లను గుర్తుచేసుకుంటూ రోజంతా ఉత్సాహంగా గడిపారు. ఈ సందర్భంగా తమకు విద్యాబుద్ధులు నేర్పిన గురువులు శేషారావు, పాపిరెడ్డి, సంగమేశ్వర్, అంజయ్య, ప్రతాప్ రెడ్డి, బసవలింగప్ప, నాగన్న, ఖుద్దూస్, చంద్రశేఖర్లను విద్యార్థులు శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించి పాదాభివందనం చేశారు.
ఉపాధ్యాయులు మాట్లాడుతూ ఎక్కడ ఉన్నా క్రమశిక్షణతో, ఉన్నత విలువులతో జీవించాలని, నాటి విద్యార్థులు నేడు వివిధ రంగాల్లో స్థిరపడి సమాజసేవలో భాగస్వాములు కావడం గర్వకారణంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు.