గజ్వేల్, ఆగస్టు 7: ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛదనం-పచ్చదనంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భార తి హోళికేరి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలంలోని బయ్యారం, మున్సిపల్ పరిధిలోని రాజీవ్‌పార్కులో నిర్వహించిన స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు.
బయ్యారం గ్రామస్తులతో మాట్లాడి గ్రామాన్ని శు భ్రంగా ఉంచుకుంటే ఎలాంటి వ్యాధులు రావని, అందుకు అందరి సహకారం ఉంటుందన్నారు. ప్రతిఒక్కరూ ఇంటిని ఎలా శుభ్రంగా ఉంచుకుంటా మో పరిసరాలను అలాగే శుభ్రంగా ఉంచుకుంటే వర్షాకాలంలో వ్యాపించే వ్యాధులకు దూరంగా ఉం టామన్నారు. మున్సిపల్ పరిధిలోని రాజీవ్ పార్కు లో మొక్కలు నాటిన అనంతనం పక్కనే ఉన్న ఇం టి యజమానులతో మాట్లాడి ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఆమె సూచించారు.
వర్షాకాలంలో నీటినిల్వ లేకుండా చూసుకోవాలన్నారు. నీటి నిల్వతో దోమలు వ్యాపించి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయన్నారు. ఐదు రోజులు ప్రభు త్వం సూచించిన విధంగా వివిధ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలన్నారు. కార్యక్రమంలో డీపీ వో దేవకీదేవి, డీఆర్డీఏ పీడీ జయదేవ్, గజ్వేల్ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఎంపీడీవో శ్రావణ్, కమిషనర్ నర్సయ్య, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, వైస్ చైర్మన్ జకీయోద్దీన్, కౌన్సిలర్ అత్తెల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి
ములుగు, ఆగస్టు 7: ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఉమ్మడి మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళికేరి అన్నారు. సిద్దిపేట జిల్లా ము లుగు మండలం జప్తిసింగాయపల్లిలో నిర్వహించి న ‘స్వచ్ఛదనం-పచ్చదనం’ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గ్రామంలోని వీధులను పరిశీలించిన అనంతరం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… మొక్కల పెంపకాన్ని బాధ్యతగా స్వీకరించి గ్రామా ల్లో విరివిగా నాటి వాటిని సంరక్షించాలన్నారు.
ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉన్నదన్నారు. వర్షపు నీటిని వృథా కాకుండా గ్రామాల్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ జయదేవ్, డీపీవో దేవకీదేవి, ఎంపీడీవో వెంకట శ్రీరామకృష్ణశర్మ, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్‌గౌడ్, శోభ, శ్రీలత, రాజు, తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.