మెదక్ మున్సిపాలిటీ, మార్చి 9: గర్భిణులు, బాలింతలు పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకొని బలవర్ధకమైన పౌష్టికాహారం అందించాలని మెదక్ కలెక్టర్ రాజర్షి షా వైద్యాధికారులు, ఐసీడీఎస్ అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో అదనపు కలెక్టర్ రమేశ్‌తో కలిసి విలేజ్ హెల్త్ శానిటేషన్, న్యూట్రిషన్, అంగన్వాడీ కేంద్రాలకు బియ్యం పంపిణీ, కార్యక్రమాలతో పాటు ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు, మహి ళా క్లినిక్‌లు, కంటి వెలుగు, ఎన్సీడీ కిట్ల పంపిణీ, పదో తరగతి విద్యార్థుల్లో మానసిక ఒత్తిడి తగ్గించే విధంగా ప్రేర ణ తరగతుల నిర్వహణ అంశాలపై సమీక్షించారు.
ఈ సం దర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి నెల రూపొందించిన క్యాలెండర్ ప్రకారం.. మొదటి వీహెచ్ఎస్ఎన్డీలో బుధ, శనివారాల్లో అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లల ఎత్తు, బరువులు పరీక్షించి పోషక లోపం గల పిల్లల(సామ్), బరువు లోపం (మామ్) ఉన్న పిల్లలను గుర్తించి గుడ్లు, బాలామృతం అందించాలన్నారు. గత నెలలో జిల్లాలో గుర్తించిన 287మంది సామ్ 1131మంది మామ్ పిల్లల వివరాలను ఆన్లైన్లో మ్యాపింగ్ చేస్తూ సరైన పోషక పదార్ధాలు ఇవ్వాలని సూచించారు. వీహెచ్ఎస్ఎన్డీలో వైద్యాధికారులు సహాకారంతో గర్భిణులు, బాలింతలు, చంటి పిల్లలకు టీకాలు వేయించాలన్నారు.
ఆశ వర్కర్లు, ఏఎన్ఎమ్లు అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లు, సమన్వయంతో పనిచేస్తూ హైరిస్క్‌తో బాధపడుతున్న గర్భిణులు, పిల్లల ఆరోగ్య విషయంలో వైద్య సౌకర్యాలు అందించే విధంగా మానిటరింగ్ చేయలన్నారు. వారికి ఎక్సర్సైజ్ ఏ విధంగా చేయాలో వీడియోలు చూయించాలని సూచించారు. పిహెచ్సీ వారిగా ప్రసవాల ప్రగతిని సమీక్షిస్తూ జిల్లాలో 81శాతం ప్రసవాలు ప్రభుత్వ దవాఖానతో జరుగుతుండటం వలన వైద్య ఆరోగ్యశాఖ మం త్రి ప్రశంసిస్తూ వందశాతం జరిగేలా కృషి చేయాలని కోరినట్లు తెలిపారు. ఆ దిశగా వైద్యులు దవాఖానకు వచ్చే గర్భిణులకు మేమున్నమనే దైర్యాన్ని కల్పిస్తూ ప్రోత్సహించాలన్నారు. మహిళలు గైనిక్ సమస్యలు చెప్పుకొని వైద్య పరీక్షలు చేయించుకునే విధంగా ప్రతి మంగళవారం ప్రత్యేకంగా జిల్లాలోని 6ప్రాంతాల్లో మహిళా ఆరోగ్య కేంద్రాలను ఏర్పాటు చేశామని, ఈ కేంద్రాల్లో ఓపీ సేవలు పెరిగేలా చూడాలని సూచించారు.
కంటి వెలుగు శిబిరాల్లో ప్రతి రోజు సుమారుగా 150 మందికి తగ్గకుండా పరీక్షలు నిర్వహించాలన్నారు. బీపీ, మధుమేహ వ్యాధితో బాధపడుతున్న రోగులకు ప్రతి నెల 5వ తేదీలోగా ఎమ్సీడీ కిట్లు అందించాలని, ప్రతి మూడు నెలలకోసారి రోగులను పరీక్షించి మందులు కంటిన్యూ చేయాలా, మార్చాలో చూడాలన్నారు. దవఖానాల్లో పరిక్షిస్తున్న ఓపీ పెషేంట్లలో 30శాతం డయాగ్నస్టిక్ పరీక్షలకు నమూనాలు పంపాలన్నారు.
గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సీబీసీ పరీక్షలు నిర్వహించాలని వైద్యులకు సూచించారు. పదో తరగతి, ఇంటర్ పరీక్షలకు ఉన్నందు న పిల్లలు మానసిక ఒత్తిడికి లోనవకుండా పాఠశాలలో మోడిటేషన్ తరగతులు నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో డీఎంహెచ్‌వో చందునాయక్, జిల్లా మహిళా శిశుసంక్షేమాధికారి బ్రహ్మజీ, డీఎస్వో శ్రీనివాస్, తదితర అధికారులు పాల్గొన్నారు.