మెదక్ మున్సిపాలిటీ, ఆగస్టు 10: ఢిల్లీ ఎర్రకోటలో జరిగే స్వాతంత్య్ర దినోత్స వ వేడుకలను వీక్షించడానికి మెదక్ జిల్లా కేంద్రంలోని గిరిజన మహిళా కళాశాల విద్యార్థిని వనజకు ఆహ్వానం వచ్చినట్లు ఆ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఉమాదేవి శనివారం విలేకరులకు తెలిపారు.
వనజ డిగ్రీ బీజెడ్సీ తృతీయ సంవత్సరం చదువుతూ ఎన్ఎస్ఎస్ యూనిట్ ఆధ్వర్యంలో నిర్వహించే వివిధ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడంతో పాటు ప్రజలకు వివిధ పథకాలపై అవగాహన కల్పించారన్నా రు. ఇందుకు ఆగస్టు 15న ఢిల్లీలో జరిగే స్వా తంత్య్ర దినోత్సవ వేడుకలు వీక్షించడానికి పిలుపు వచ్చిందని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కళాశా ల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం అధికారి శరత్దీపిక, కళాశాల అధ్యాపకులు వనజను అభినందించారు.