పటాన్చెరు, అక్టోబర్ 24 : అంతర్రాష్ట్ర గంజాయి స్మగ్లర్‌ను బీడీఎల్ భానూర్ పోలీసులు పట్టుకుని 50 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం పటాన్చెరు డీఎస్పీ కార్యాలయంలో మీడియాకు డీఎస్పీ రవీందర్‌రెడ్డి, బీడీఎల్ భానూ ర్ ఎస్‌హెచ్‌వో స్వామిగౌడ్ వివరాలు వెల్లడించారు. బుధవారం బీడీఎల్ ఎస్‌హెచ్‌వో సిబ్బందితో కలసి నిర్వహిస్తున్న తనిఖీల్లో అనుమానాస్పదంగా కనిపించిన కారును పరిశీలించారు. ఈ తనిఖీలో 25 ప్యాకెట్ల గంజాయి లభించింది.
వాహ నం నడుపుతున్న మల్లేశ్ జాదవ్(26)ను విచారించారు. బీదర్ జిల్లాకు చెందిన మల్లేశ్ జాదవ్ హైదరాబాద్‌లోని రాజేంద్రనగర్‌లో టిఫిన్ సెంటర్లో పనిచేస్తాడు. కొనేండ్లుగా అతడు గంజాయి నేరగాళ్లతో సావాసం చేసి తానే గంజాయి అమ్మే స్మగ్లర్ గా మారాడు.
గంజాయిని ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లా నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నాడు. అతడి నుంచి రూ.12లక్షల విలువైన 50 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రెండు కార్లు, బైక్, రెండు మొబైల్ఫోన్లను పోలీసులు సీజ్ చేశారు. అతడితోపాటు గంజాయి స్మగ్లింగ్‌లో పా ల్గొంటున్న దాదాపాటిల్, ప్రవీణ్, బీదన్ పరారీలో ఉన్నారని, మల్లేశ్ జాదవ్‌ను అరెస్టు చేసి సంగారెడ్డి కోర్టుకు తరలిస్తున్నామని చెప్పారు. నిందితుడిని పట్టుకున్న బీడీఎల్ ఎస్‌హెచ్‌వో స్వామిగౌడ్‌ను, పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.