పటాన్చెరు, ఆగస్టు 1: వ్యర్థాల నిర్వహణ-వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, ఐపీఎల్ అంతర్జాతీయ ఫోరం 2024పై 14వ అంతర్జాతీయ సదస్సును గీతం స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించనున్నది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిపుణులతో చర్చలు, విజ్ఞాన భాగస్వామ్యాన్ని సులభతం చేయడానికి ఈ ఏడాది నవంబర్ 28 నుంచి డిసెంబర్ 1వరకు హైబ్రిడ్ విధానంలో సదస్సును నిర్వహించనున్నామని నిర్వాహకులు గురువారం ప్రకటనలో తెలిపారు.
సమావేశంలో వ్యర్థాల నిర్వహణ, వృత్తాకార ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అనేక ఇతివృత్తాలు, వ్యర్థాలు, విధానాలు, నిబంధనలు, ఇంజినీరింగ్, సాంకేతికత, సామాజిక, వ్యాపా ర, పరిశ్రమలు వంటివి ఉంటాయన్నారు. విద్యారంగ ప్రతినిధులు, పరిశోధనా సంస్థలు, పరిశ్రమల్లో పనిచేసేవారు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల ఉద్యోగులు, నియంత్రణ సంస్థల ప్రతినిధులు, ఆరోగ్య పరిరక్షణ సంస్థలు, ఇతర ఆసక్తిగలవారు సెప్టెంబర్ 15లోగా ఈ-మెయిల్iconswm.ce@gmail.com/ iconswme@gitam.edu ద్వారా సమర్పించాలన్నారు.
నిర్దిష్ట రుసుం చెల్లించి వ్యక్తిగతంగా లేదా ఆన్లైన్లో సదస్సుకు హాజరుకావచ్చని, కాన్ఫరెన్స్ ఈ-ప్రొసీడిండ్స్ కూడా ప్రచురిస్తామన్నారు. సదస్సుతోపాటు, స్కూల్ కాంగ్రెస్, హ్యాకథాన్, ఇండస్ట్రీ ఎ క్స్పోలను నవంబర్ 27న నిర్వహిస్తామన్నారు. వివరాల కోసం సాధన్ కేఘోష్ 9830044464, థోర్లన్ 8886785076 నంబర్లో సంప్రదించాలన్నారు.