చిన్నశంకరంపేట, జూలై 29: మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మం డల సూరారంలో సోమవారం డెంగీతో ఇంటర్ విద్యార్థి మృతి చెందాడు. గ్రామస్తుల వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన సరస్వతి, వెంకటేశం దంపతుల పెద్ద కుమారుడు కుమ్మరి నిఖిల్ (17) హైదరాబాద్ బోరంపేటలోని శ్రీచైత న్య జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
ఈనెల 19న కళాశాల యాజమాన్యం విద్యార్థులకు హో మ్ సిక్ సెలవులు ఇవ్వడంతో నిఖిల్ ఇంటికి వచ్చాడు. ఆదివారం ఉద యం ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురికాగా, చేగుంటలోని ఓ ప్రైవేటు దవాఖానకు తరలించా రు. అక్కడ రక్త పరీక్షలు చే యించగా డెంగీగా తేలిం ది. తెల్ల రక్తకణాలు పూర్తి గా పడిపోయాయని వైద్యులు హైదరాబాద్కు సిఫార్సు చేశారు. హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ దవాఖానకు తరలించగా, చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించి ఆదివారం అర్ధరాత్రి నిఖిల్ మృతి చెందాడు.