కాంగ్రెస్‌లో ఇన్చార్జి సెగ
సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాల రాజుకుంది. ఈ రచ్చకు నంగునూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం కారణమైంది.పార్టీ కోసం కష్టపడి, అక్రమ కేసులు ఎదురొని నిలబడ్డ కార్యకర్తలను కాదని పైరవీకారులకే పెద్దపీట వేస్తున్నారంటూ స్థానిక నేతలు నిరసన వ్యక్తం చేశారు.
- సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్‌లో అసమ్మతి జ్వాల
- ఫ్లెక్సీ దహనం.. రచ్చకెకిన పదవుల అమ్మకాలు
- ఇన్చార్జి మాకొద్దంటూ కాంగ్రెస్ నాయకుల నిరసన
నంగునూరు, మార్చి 30: సిద్దిపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాల రాజుకుంది. ఈ రచ్చకు నంగునూరు మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ నియామకం కారణమైంది.పార్టీ కోసం కష్టపడి, అక్రమ కేసులు ఎదురొని నిలబడ్డ కార్యకర్తలను కాదని పైరవీకారులకే పెద్దపీట వేస్తున్నారంటూ స్థానిక నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఇటీవల నాయకుడు దేవులపల్లి యాదగిరిని చైర్మన్‌గా, యూత్ కాంగ్రెస్ నాయకుడు సాదుల పవన్‌కుమార్‌ను వైస్ చైర్మన్‌గా, మరో 16 మందిని డైరెక్టర్లుగా నియమించారు.
ఆదివారం చైర్మన్ యాదగిరి ఇతర నేతలతో కలిసి జిల్లా ఇన్చార్జి మంత్రి వివేక్‌ను కలవగా ఆయన నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ సమక్షంలో నియామక పత్రాన్ని అందజేశారు. సోమవారం సభ్యుల పేర్లు బహిర్గతం కావడంతో అసమ్మతి జ్వాలలు ఎగిసిపడ్డాయి. మండల కేంద్రంలో నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణ తీరుపై కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయన ఫ్లెక్సీని దహనం చేసి మాకొద్దు ఈ ఇన్చార్జి అంటూ నినాదాలు చేశారు. మారెట్ కమిటీ పదవులు అమ్ముకున్నారని కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తప్పెట శంకర్, గ్రామ శాఖ అధ్యక్షుడు అనరాజు నాగరాజు బహిరంగంగా ఆరోపించారు.
20 ఏండ్లు పార్టీ జెండా మోసిన తమను కాదని పైరవీకారులకే ప్రాధాన్యం ఇవ్వడంపై మండిపడ్డారు.నియోజకవర్గంలో ప్రొటోకాల్ పాటించడం లేదని,సీనియర్లకు కనీస గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మండల సీనియర్ నాయకులు సత్తయ్య, సంపత్, చెలికాని యాదగిరి, తిరుపతి యాదవ్, జంగిటి శ్రీనివాస్, రాగుల కనకయ్య, రాగుల కృష్ణ, దేవులపల్లి ప్రసాద్, పంగ శేఖర్, దేవులపల్లి శంకరయ్య, ఆరెపల్లి సురేశ్ పాల్గొన్నారు.
ఒక వర్గం మోదం.. మరో వర్గం ఖేదం
సిద్దిపేట జిల్లా నంగునూరు ఏఎంసీ చైర్మన్ నియామకంపై ఒక వర్గం రచ్చ చేస్తుంటే మరో వర్గం క్షీరాభిషేకం చేసి మద్దతుగా నిలిచింది. మండలంలో ఒక వైపు నిరసనలు కొనసాగుతుండగానే రాజగోపాల్‌పేటలో మరో వర్గం నాయకులు నియోజకవర్గ ఇన్చార్జి పూజల హరికృష్ణకు మద్దతుగా నిలిచారు. మారెట్ కమిటీ వైస్ చైర్మన్ పవన్, డైరెక్టర్ల ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి క్షీరాభిషేకం చేయడం కొసమెరుపు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

