Medical Camp | రామాయంపేటలో రెడ్‌క్రాస్ మెగా వైద్య శిబిరం
ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం (Medical Camp) నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్‌లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వివిధ పరీక్షలు చేయించుకున్నారు.
రామాయంపేట రూరల్, మే 08: ప్రపంచ రెడ్‌క్రాస్ దినోత్సవం సందర్భంగా రామాయంపేట మండలం ఆర్.వెంకటాపూర్‌లో ఉచిత మెగా వైద్య శిబిరం (Medical Camp) నిర్వహించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆద్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ క్యాంప్‌లో ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. వివిధ పరీక్షలు చేయించుకున్నారు. నిరుపేదలందరికి సంపూర్ణ ఆరోగ్యం అందించే దిశగా అన్ని పరీక్షలు చేశామని రెడ్ క్రాస్ మెదక్ శాఖ బృందం సభ్యులు తెలిపారు. అలాగే ఉచితంగా మందులు అందించామన్నారు.
ఒకప్పుడు జిల్లాలో అక్కడక్కడ శిబిరాలు నిర్వహించి పేదలకు సేవలు అందించే వారమని, ఇప్పుడు ప్రతి గ్రామంలో రెడ్ క్రాస్ సేవలు ప్రజలకు అందున్నాయని చెప్పారు. రెడ్ క్రాస్ ద్వారా ఆరోగ్య శిబిరాలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ మెదక్ శాఖ చైర్మన్ డాక్టర్ లయన్ రాజశేఖర్‌రెడ్డి, కోశాధికారి డీజీ శ్రీనివాస శర్మ, మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు యాదగిరి, దామోదర్‌రావు, మద్దెల సత్యనారాయణ, మద్దెల రమేష్, సతీష్ రావు, తోట శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

