సిద్దిపేట, ఫిబ్రవరి 11: గురుపరంపర, సంస్కృతీ సంప్రదాయాలతో ప్రపంచంపై భారత్ చెరగని ముద్ర వేస్తున్నదని పతంజలి యోగా పీఠాధికారి స్వామి యజ్ఞదేవ్ అన్నారు. ఆదివారం సిద్దిపేట యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్, వ్యాస మహర్షి యోగా సొసైటీ ఆధ్వర్యంలో సిద్దిపేట బాలికల పాఠశాల గ్రౌండ్లో రాష్ట్రస్థాయి సూర్య నమసారాల పోటీలు నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ.. యోగా, ధ్యానం, ప్రాణాయామం మొదలగు విద్యలు దేశాన్ని సుసంపన్నం చేశాయన్నారు. గురువుల మార్గదర్శనంలో సమాజం వికసిస్తుందన్నారు. ప్రపంచం ఎదురొంటున్న అనేక సమస్యలకు భారతీయ సంస్కృతిలో సమాధానాలు ఉన్నాయని తెలిపారు.
తెలంగాణ యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, భారత రాజ్య సంఘటన మంత్రి నందనం కృపాకర్ మాట్లాడుతూ యోగా అద్భుతమైతే, సూర్య నమసారాలు శ్రేష్ఠమైనవని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మంజులా రాజనర్సు, సిద్దిపేట స్పోర్ట్స్ అథారిటీ కన్వీనర్ పాల సాయిరాం, సుడా పూర్వ డైరెక్టర్ మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, జాతీయ యోగా మెడలిస్ట్, శిక్షకుడు తోట సతీశ్, సంధ్య యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రామిరెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తోట అశోక్, గౌరవాధ్యక్షుడు అంజయ్య ,ఉత్సవ కమిటీ కన్వీనర్లు చిప్ప ప్రభాకర్, రాజ్‌కుమార్, గంగపురం శ్రీనివాస్, డాక్టర్ అరవింద్, సిరి చిల్డ్రన్స్ దవాఖాన డాక్టర్ సాయి, జవాన్ గార్డింగ్ సర్వీస్ సతీశ్‌రెడ్డి, మల్లికార్జున్ తదితరులు పాల్గొన్నారు.