పుల్కల్,అక్టోబర్ 21: సంగారెడ్డి జిల్లా పుల్కల్ మం డలంలోని బాగారెడ్డి సింగూరు ప్రాజెక్టుకు ఇన్‌ఫ్లో పెరిగింది. రెండు రోజులుగా ప్రాజెక్టులోకి వచ్చే వరద తగ్గడంతో అధికారులు క్రస్ట్ గేట్లను మూసివేశారు. సోమవారం సాయంత్రం ఉన్నట్టుండి వరద ఉధృతి పెరగడంతో అప్రమత్తమై ప్రాజెక్టు ఆరో గేటును ఎత్తి దిగువకు నీటిని వదిలినట్లు అధికారులు తెలిపారు.
ప్రాజెక్టులోకి ఇన్‌ఫ్లో 2,000 క్యూ సెక్కులు వస్తుండగా, అవుట్‌ఫ్లో 3,471క్యూసెక్కులు దిగువకు వెళ్తున్నట్లు అధికారులు వెల్లడించా రు. విద్యుత్ ఉత్పత్తి కోసం జెన్కోకు 2,725 క్యూసెక్కుల నీటిని విడుదల చేయగా, హెచ్ఎండబ్ల్యూఎస్కు 80 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 70 క్యూ సెక్కులు, వృథాగా వెళ్తున్న నీరు 350 క్యూసెక్కులు ఉంటుందని ప్రాజెక్టు ఏఈ మహిపాల్‌రెడ్డి తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 29.917 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 29.917 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.