మెదక్ డిసెండర్25,(నమస్తేతెలంగాణ): పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మం డల స్థాయి స్టాక్ పాయింట్ లో పనిచేస్తున్న హమాలీలకు హ మాలీ చార్జీలు, నగదు ప్రోత్సాహకాలతో పాటు స్వీపర్లకు కూ డా చార్జీలను, నగదు ప్రోత్సాహకాలను రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని అదనపు కలెక్టర్ రమేశ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం హమాలీలకు క్వింటాలుకు ఇస్తున్న హమాలీ చార్జీలు 22 నుంచి 26 రూపాయాలకు, ప్రతి ఏటా రెండు జతల బట్టల కుట్టుకూలికి ఇస్తున్న డబ్బులు వేయి నుంచి రూ.1300కు, స్వీట్ బాక్స్ రూ.700నుంచి 800 లతో పాటు నగదు పారితోషికం 5500 నుంచి 6500 రూపాయలకు పెంచిందని ఆయన తెలిపారు.
500 మెట్రిక్ టన్నులలోపు ఎంఎల్ఎస్ గోదాముల్లో పనిచేస్తున్న మహిళా స్వీపర్లకు ప్రస్తుతమిస్తున్న గౌరవ వేతనం రూ.4000 నుంచి 5000కు, 500 నుంచి 1000 లోపు మెట్రిక్ టన్నుల గోదాముల్లో పనిచేస్తున్న వారికి రూ.4500 నుంచి 5500 లకు వెయ్యి మెట్రిక్ ట న్నుల సామర్థ్యం ఆపై గల గోదాముల్లో పనిచేస్తున్న వా రికి రూ.5000 నుంచి 6000 వరకు వేతనం పెంచిందని ఆయన పేర్కొన్నారు. వీరికి ప్రతి ఏటా రెండు చీరలు, జాకెట్ల కుట్టికూలికి ప్రస్తుతం ఇస్తున్న డబ్బులు 1458 నుంచి 1500లకు, స్వీట్ బాక్స్‌ను 700 నుంచి 800 ల వరకు , నగదు పారితోషికం 5500 నుంచి 6500 రూ పాయల వరకు పెంచిందని, తద్వారా ప్రభుత్వానికి ఏ టా 10 కోట్ల 57లక్షల రూపాయల అదనపు భారం పడుతుందని ఆయన తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం ప్ర భుత్వం 27 నెంబర్ ద్వారా ఉత్తర్వులు జారీచేస్తూ జిల్లాలకు వర్తమానం పంపిందని ఆయన తెలిపారు. ఈ పెం పుదల జిల్లాలోని మెదక్, పాపన్నపేట, పెద్దశంకరంపేట, రామాయంపేట, చేగుం ట, తూప్రాన్, నర్సాపూర్‌లో నిర్వహిస్తున్న 7 ఎంఎల్ఎస్ పాయింట్లలో పనిచేస్తున్న 73 మంది హమాలీల, 14 మంది స్వీపర్లకు ప్రయోజనం చేకూరుతుందని అదనపు కలెక్టర్ రమేశ్ తెలిపారు.