గొప్ప సమాజ నిర్మాణ బాధ్యత అధ్యాపకులదే అని న్యాక్ పీర్ టీం చైర్మన్ హోసియార్ దామి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వరుసగా రెండో రోజు మంగళవారం న్యాక్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా హోసియార్ దామి మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేసే విధంగా మెరుగైన విద్య అందించాలన్నారు. బోధనకు సాంకేతికత తోడైతే అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత అధ్యాపకులపై ఉందన్నారు.
సిద్దిపేట టౌన్,డిసెంబర్ 19 : సమాజ నిర్మాణ బాధ్యత అధ్యాపకులదే అని న్యాక్ పీర్ టీం చైర్మన్ హోసియార్ దామి అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలను వరుసగా రెండో రోజు మంగళవారం న్యాక్ బృందం సందర్శించింది. ఈ సందర్భంగా న్యాక్ టీం కళాశాలలో అందుబాటులో ఉన్న ఆధునిక పరికరాలను విద్యార్థులు ఏ విధంగా వినియోగించుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. అంత కుముందు కళాశాల గ్రంథాలయాన్ని సందర్శించి అందులోని పుస్తకాలు,వార్తపత్రికలు, ఆన్లైన్ డిజిటల్ విధానాన్ని పరిశీలించారు. బోధన సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశమై సూచనలు సలహాలు ఇ చ్చారు. అనంతరం హోసియార్ దామి మాట్లాడుతూ..కాలనుగుణంగా విద్యార్థుల భవిష్యత్ బాట లు వేసే మెరుగైన విద్యను అందించాలన్నారు.బోధనకు సాంకేతికత తోడైతే అద్భుత ఫలితాలు సాధించవచ్చన్నారు. విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత అధ్యాపకులదే అని చెప్పారు. జాతీయ సమగ్రతకు కృషి చేయాలని బెనారస్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బ్రజా భూషణ్ ఓజా అన్నారు.న్యాక్ టీం సభ్యుడు అయ్యాపిలై సెల్వమణి మాట్లాడుతూ..విద్యార్థులలోని నైఫుణ్యాన్ని వెలికి తీయాలని సూచించారు.కళాశాలలో ప్రత్యేంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ డాక్టర్ ప్రసాద్, అధ్యాపకులు మధుసూదన్, వాసం శ్రీనివాస్, గోపాల సుదర్శనం పాల్గొన్నారు.