పటాన్చెరు, ఫిబ్రవరి 8: హైదరాబాద్‌లోని గీ తం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ‘ప్రమాణ-2025’ రెండో రోజు శనివారం ఎలక్ట్రిఫైయింగ్ ఆటో ఎక్స్పో- ఆటోమేనియా అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమానికి ఔత్సాహికులు, విద్యార్థులు రకరకాల వాహనాలతో హాజరయ్యారు. అత్యాధునిక ఆటోమొబైల్ వాహనాలను ప్రదర్శించారు. ఆటో ఎక్స్‌పోలో సెంట్రల్ రిజర్వ్ పోలీసు దళం (సీఆర్పీఎఫ్) కూడా అత్యాధునిక ఆయుధ వాహనాన్ని ప్రదర్శించింది. ఈ భారీ వాహనాన్ని పేలుళ్లు, ల్యాండ్మైన్ల నుంచి రక్షించేలా రూపొందించారు. వజ్ర, మినీ వజ్ర వాహనాల మాక్‌డ్రిల్ అందరినీ ఆకర్షించింది.
ప్రమాణ-2025 సాంకేతిక, సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులను ఆకట్టుకున్నాయి. హ్యాకథాన్లు, సాఫ్ట్వేర్-హార్డ్‌వేర్ ప్రాజెక్టు, ఎక్స్‌పోలో విద్యార్థులు పాలుపంచుకున్నారు. శాస్త్ర ప్రదర్శనలు, ఫ్రీ ైస్టెల్ రాప్ బాటిల్స్, డీజే పోటీల్లో విద్యార్థులు ప్రతిభ కనబర్చారు. సినిమాటిక్ మేకప్, స్ప్రే పెయింట్ ఆర్ట్, స్లిమ్ మేకింగ్, ఎమర్జెన్సీ ఇంపాక్ట్ వంటి వాటిలో శిక్షణ కోసం వర్క్‌షాప్స్ జరిగాయి. 9టీన్, వర్ణం బ్యాండ్లహై-ఎనర్జీ ప్రదర్శన విద్యార్థులను ఉర్రూతలూగించింది. విద్యార్థుల ర్యాంప్‌వాక్ అలరించింది. ఈ కార్యక్రమంలో గీతం ప్రతినిధులు పాల్గొన్నారు.