అందోల్-జోగిపేట బల్దియాలో జోరుగా అక్రమ నిర్మాణాలు
సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లు బఫర్‌జోన్, ఎఫ్టీఎల్, చెరువులు, కుంటలను కొంతమంది ఆక్రమించి.. భారీ భవనాలు, షాపింగ్ కాంప్లెక్సులు నిర్మిస్తున్నారు. మరికొందరు సరైన అనుమతులు, నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతూ మున్సిపల్ ఆదాయానికి గండిగొడుతున్నారు.
- బఫర్ జోన్, ఎఫ్టీఎల్నూ వదలని కబ్జాదారులు
- అనుమతులు లేకున్నా భారీ భవనాల నిర్మాణం
- చెరువు నీటిలోనే కాంప్లెక్స్ ప్రహరీ
- పట్టించుకోని అధికారులు
- మున్సిపల్ ఆదాయానికి గండి
- కనిపించని బఫర్‌జోన్ హద్దురాళ్లు
అందోల్, జూన్ 11: సంగారెడ్డి జిల్లా అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. కాదేది కబ్జాకు అనర్హం అన్నట్లు బఫర్‌జోన్, ఎఫ్టీఎల్, చెరువులు, కుంటలను కొంతమంది ఆక్రమించి.. భారీ భవనాలు, షాపింగ్ కాంప్లెక్సులు నిర్మిస్తున్నారు. మరికొందరు సరైన అనుమతులు, నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు చేపడుతూ మున్సిపల్ ఆదాయానికి గండిగొడుతున్నారు.
సుమారు 500 వందల ఎకరాల్లో విస్తరించిన అందోల్ పెద్ద చెరువు అందోల్- జోగిపేట, మసాన్‌పల్లి శివారు వరకు విస్తరించి ఉంటుంది. అందోల్ బస్టాండ్ నుంచి జోగిపేట బస్టాండ్ వరకు పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిలోకి వస్తుందని అధికారులు చెబుతున్నా, ఈ పరిధిలో ఇప్పటికే నిర్మాణాలు కొనసాగుతున్నాయి. రూ.కోట్ల విలువైన భూములు కబ్జాకు గురవుతున్నా అధికారులు తమకేమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. చిన్నాచితక రైతులు ఎవరైనా చెరువులో వారికి పట్టాలు ఉన్న స్థలంలో పశువులకు కొట్టాలు వేసుకుంటే గంటల వ్యవధిలో తొలిగిస్తున్నారు.
పైసా కొట్టు.. అనుమతి పట్టు..?
అందోల్-జోగిపేటలో అంతా పైసా కొట్టు నిర్మాణ అనుమతులు చేపట్టు అన్నట్లు సాగుతున్నది. ఒక్క ఫ్లోర్‌కు అనుమతి తీసుకుని 5 ఫ్లోర్లు కట్టడం, ఎఫ్టీఎల్, బఫర్ జోన్ల పరిధిలో అనుమతులు రాకున్నా, నిబంధనలకు విరుద్ధ్దంగా భారీ భవనాలు నిర్మించడం ఇష్టారాజ్యంగా మారింది. ఇలాంటి వాటిపై చర్యలు చేపట్టాల్సిన అధికారులు, పాలకవర్గం వెనుకడుగు వేస్తున్నది. వారిచ్చే నజరానాలు తీసుకుని గమ్మునుండడంతో అందోల్-జోగిపేట యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.
కారుకు దారిలేదు.. అయినా షాపింగ్ కాంప్లెక్స్
జోగిపేట నడి సెంటర్లో పాత హనుమాన్ టాకీస్ ప్రాంతంలో కారు వెళ్లేందుకు వీలులేని చోట షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నారు. ఎప్పుడూ రద్దీగా ఉండే ప్రాంతంలో వెనుక గోడకు అనుకుని పెద్ద చెరువు నీళ్లు పారుతుండగా, అందులోనే ప్రహరీ నిర్మించి, కాంప్లెక్స్ నిర్మాణం చేపతున్నాడు ఓ గోల్డ్ వ్యాపారి. అది కూడా మున్సిపల్ నుంచి అనుమతులు లేకుండానే. ఈ కాంప్లెక్స్‌లో ఒక్క నిబంధన పాటించడంలేదు.
ఏదైనా ప్రమాదం జరిగితే ఫైరింజిన్ వచ్చే అవకాశం లేదు. పట్టణ నడి సెంటర్లో ఇలాంటి నిర్మాణాలు జరుగుతున్నా కనీస చర్యలు చేపట్టడంలేదు. దీనిపై కలెక్టర్ స్పందించి చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. 500 వందల ఎకరాల విస్తీర్ణంలో ఉన్న అందోల్ పెద్ద చెరువు ఇప్పటికే చాలా భాగం కబ్జాకు గురైందని, దాన్ని కాపాడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి చెరువుకు నలువైపులా సర్వే నిర్వహించి కబ్జాలు తొలిగించి హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రాక్టర్ టైరు కిందపడి వ్యక్తి దుర్మరణం.. మెదక్ జిల్లాలో విషాదం
Ranji Trophy: త్రిపురపై ఇన్నింగ్స్ 40 రన్స్ తేడాతో హైదరాబాద్ విన్
Jailer 2 | ‘జైలర్ 2’ అడ్వాన్స్ బుకింగ్స్‌లో దూకుడు.. బుక్‌మైషోలో 6 లక్షలు దాటిన టికెట్ల అమ్మకాలు!
Farmers | చెరుకు రైతుకు గిట్టుబాటు ధర ఏదీ?తగ్గిన దిగుబడి, పెరిగిన పెట్టుబడి ఖర్చులతో అన్నదాతల ఆవేదన
Jos Buttler: జోస్ బట్లర్‌కు సర్జరీ.. కోలుకుంటున్నట్లు ఇన్‌స్టాలో పోస్టు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

