సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 28: ప్రభుత్వం ఇచ్చి న హామీ ప్రకారం ఐకేపీ వీవోఏలకు కనీస వేత నం రూ. 26వేలు అమలు చేయాలని, గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా వేతనాలు ఇవ్వాలని, ఇతర పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ ఆధ్వర్యంలో బుధవారం సం గారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సం దర్భంగా సీఐటీయూ నాయకుడు సాయిలు మా ట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగ భద్రత కల్పించాలని, రూ.10 లక్షల సాధారణ బీమా, ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలన్నారు. సెర్ఫ్ నుంచి ఐడీ కార్డులు జారీ చేయాలని, గ్రామ సంఘం గ్రేడింగ్‌తో సంబంధం లేకుండా ప్రతి నెలా వేతనాలను వీవోఏల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల్లో జమచేయాలని, ఎస్‌హెచ్‌జీ, వీవోలైవ్ మీటింగ్స్ రద్దు చేయాలన్నారు. గ్రామ సంఘానికి ల్యాప్ టాప్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో ఐకేపీ వీవోఏల సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం. నగేశ్, కార్యదర్శి ముస్తాఫా, నాయకులు అనిత, భాగ్యలక్ష్మి, మాధవి, మల్ల య్య తదితరులు పాల్గొన్నారు.