సంగారెడ్డి ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): జపాన్ దేశంలోని కంపెనీలు, సాంకేతిక విద్యాసంస్థలతో మరింత వ్యూహాత్మక భాగస్వా మ్యం పెంపొందించుకునేందుకు ఐఐటీ హైదరాబాద్ కృషి చేస్తున్న ట్లు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ బీఎస్ మూర్తి తెలిపారు. సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీహెచ్‌లో ఆదివారం జపాన్ ఎక్స్టర్నల్ ఆర్గనైజేషన్(జైట్రో) ఆధ్వర్యంలో ‘జపాన్ కెరీర్ డే’ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐఐటీహెచ్‌లో 2018 నుంచి జపాన్‌లో ఏటా కెరీర్ డే నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఐఐటీహెచ్ విద్యార్థులు జపాన్‌లో ఉద్యోగాలు పొందేందుకు ఇది ఉపయోగపడుతున్నదన్నారు. జెట్రో బెంగళూరు డైరెక్టర్ జనరల్ తోషిహిరో మిజుతామీ మాట్లాడుతూ ఈ సంవత్సరం ఎనిమిది పెద్ద కార్పొరేట్ కంపెనీలు, ఐదు ఎస్ఎంబీ కంపెనీలు, ఐదు స్టార్టప్ కంపెనీలు ఐఐటీహెచ్ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాయన్నారు. కార్యక్రమంలో జపాన్ కంపెనీల ప్రతినిధులు, ఐఐటీహెచ్ విద్యార్థులు, ప్రొఫెసర్లు పాల్గొన్నారు.
కందిలోని ఐఐటీహెచ్‌లో ఆదివారం అక్షరమాల నాలుగో వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. ఐఐటీహెచ్‌కు చెందిన గ్రామీణ అభివృద్ధి కేంద్రం(ఆర్డీసీ) గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు అక్షరమాల ద్వారా ఆన్లైన్ విద్యాబోధనను అందజేస్తున్నది. అక్షరమా ల వార్షికోత్సవ వేడుకల్లో ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి మాట్లాడుతూ అక్షరమాల ద్వారా తెలంగాణలోని తొమ్మిది జిల్లాల్లోని 70 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 4వేల మంది విద్యార్థులకు ఆన్లైన్ బోధన చేస్తున్నట్లు చెప్పారు.
ఐఐటీహెచ్తోపాటు 11 అగ్ర ఇంజినీరింగ్ కళాశాలల నుంచి 150 మంది వలంటీర్లు అక్షరమాల ద్వారా విద్యార్థులకు ఆన్లైన్లో పాఠాలు బోధిస్తున్నట్లు చెప్పారు. అక్షరమాల 2023-24లో ఉత్తమ ప్రతిభను కనబర్చిన ఏడుగురు టెన్త్ విద్యార్థులకు ఐఐటీహెచ్ డైరెక్టర్ బీఎస్ మూర్తి నగదు పురస్కారా లు, మెరిట్ సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఆర్డీసీ చైర్మన్ సతీశ్, ఎస్సీఈఆర్టీ అధికారి సురేశ్‌బాబు, డీఈవో వెంకటేశ్వర్లు, 50 మంది విద్యార్థులు, వందమంది వలంటీర్లు పాల్గొన్నారు.