హుస్నాబాద్, జనవరి 16: నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తానని రవాణా, బీసీ సంక్షేమశాఖల మం త్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ పట్టణంలోని 4,5వ వార్డుల్లో సోమవారం స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసిఆ ఆయన మార్నింగ్ వాక్ చేశారు. ప్రధాన వీధుల్లో తిరుగుతూ ప్రజలను పలకరిస్తూ, సమస్యలు తెలుసుకున్నారు. ఆయా వార్డుల్లోని ప్రజలు మంత్రికి వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలు ఏ సమస్య ఉన్నా నేరుగా తనను కలిసి చెప్పుకోవచ్చన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు సమస్యలను తెలుసుకుంటామన్నారు. ప్రజలందరూ సంక్రాంతి, కనుమ పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలన్నారు. అనంతరం నాయకులు, ప్రజాప్రతినిధులతో కలిసి అంబేద్కర్ చౌరస్తాలో టీ తాగారు. కార్యక్రమంలో సింగిల్విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నాయకులు కేడం లింగమూర్తి, ఎండీ హసన్, వల్లపు రాజు, చిత్తారి రవీందర్, ముత్యాల సంజీవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.