ప్రారంభ దశలో గుర్తిద్దాం.. క్యాన్సర్‌ను జయిద్దాం
కాన్సర్వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారించడం తేలిక అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో హైదరాబాద్‌కు చెందిన సింధు క్యాన్సర్ దవాఖాన సౌజన్యంతో ఈనెల 29, 30న నిర్వహించనున్న ఉచిత క్యాన్సర్ స్రీనింగ్ పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు.
- 40 ఏండ్లు దాటిన మహిళలు విధిగా స్రీనింగ్ పరీక్షలు చేయించుకోవాలి
- మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ హరీశ్‌రావు పిలుపు
- సిద్దిపేటలోని విపంచి ఆడిటోరియంలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం ప్రారంభం
సిద్దిపేట,జూలై29: కాన్సర్వ్యాధి వచ్చిన తర్వాత చికిత్స చేయించుకోవడం కంటే ప్రాథమిక దశలో గుర్తిస్తే నివారించడం తేలిక అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ తన్నీరు హరీశ్ రావు స్పష్టం చేశారు. బుధవారం సిద్దిపేట జిల్లా సిద్దిపేట పట్టణంలోని విపంచి కళానిలయంలో హైదరాబాద్‌కు చెందిన సింధు క్యాన్సర్ దవాఖాన సౌజన్యంతో ఈనెల 29, 30న నిర్వహించనున్న ఉచిత క్యాన్సర్ స్రీనింగ్ పరీక్షల శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ ప్రారంభ దశలో గుర్తిస్తే క్యాన్సర్‌ను జయించవచ్చన్నారు ప్రస్తు తం క్యాన్సర్ అంటే భయపడాల్సిన అవసరం లేదని ఆలస్యం చేస్తేనే ప్రమాదకరంగా మారుతుందన్నారు.
క్యాన్సర్ స్రీనింగ్ పరీక్షల కోసం హైదరాబాద్‌కు వెళ్లి వ్యయప్రయాసాలు పడకుండా ఉండేందుకు సింధు క్యాన్సర్ దవాఖాన చైర్మన్ డాక్టర్ పార్ధసారథిని సిద్దిపేటలో ఉచిత క్యాన్సర్ స్రీనింగ్ పరీక్షలు నిర్వహించాలని కోరగా వైద్యులు, సిబ్బంది వచ్చారన్నారు. రెండు రోజులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహించనున్న ఉచిత క్యాన్సర్ స్రీనింగ్ పరీక్షలను 40 ఏండ్లు దాటిన మహిళలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో ప్రతి ఏడాది 50వేల క్యాన్సర్ కేసులు నమోదవుతున్నాయని, అందుకు స్రీనింగ్ చేయించుకోకపోవడమే ప్రధాన కారణమన్నారు. మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు క్యాన్సర్ కేసుల పెరుగుదలకు కారణమవుతున్నాయన్నారు.
త్వరలో క్యాన్సర్ స్క్రీనింగ్ సెంటర్‌కు శంకుస్థాపన
సిద్దిపేటలో ఎల్వీ ప్రసాద్ దవాఖాన వద్ద స్రీనింగ్ సెంటర్ ఏర్పాటుకు త్వరలోనే శంకుస్థాపన చేయనున్నట్లు హరీశ్‌రావు తెలిపారు. సిద్దిపేటలో పేదలకు వైద్యం అందించేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో 1000 పడకల దవాఖాన ఏర్పాటు చేశామని, దాదాపు 95 శాతం పనులు పూర్తైనా ఐదుశాతం నిధులు కేటాయించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. సిద్దిపేటకు హోమియోపతి, యునాని, ఆయుర్వేద దవాఖానలు తీసుకువచ్చానని గుర్తుచేశారు. కార్యక్రమంలో సింధు దవాఖాన మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మల్లేశ్, వైద్యులు త్రిష, వైస్ ప్రెసిడెంట్ గోపాలకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు కొండం సంపత్‌రెడ్డి, నాయకులు పాల సాయిరామ్,అరవింద్‌రెడ్డి, తిరుమల్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Free Data Engineering Course | నిరుద్యోగ యువతకు శుభవార్త.. 90 రోజుల ఉచిత డేటా ఇంజినీరింగ్ కోర్సు
కేసీఆర్‌పై ‘వెలుగు’ దుష్ప్రచారం.. 24 గంటల్లో క్షమాపణ చెప్పాలి: జర్మనీ బీఆర్ఎస్ డిమాండ్
పెళ్లయిన 45 రోజులకే భర్త హత్యకు ప్లాన్.. భార్య, ప్రియుడు సహా ముగ్గురు అరెస్ట్
Road Accident | థార్ కారు బీభత్సం.. బైక్‌ను ఢీకొని ఇద్దరు దుర్మరణం
Prashant Kishor | బీహార్ ఉత్తమ నాయకులలో నితీశ్ కుమార్ ఒకరు: ప్రశాంత్ కిషోర్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

