పటాన్చెరు, ఆగస్టు 31: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణ నడిబొడ్డున ఉన్న సాకీ చెరువులోని ఆక్రమణలను శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలించారు. ఇరిగేషన్, రెవెన్యూశాఖ అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. చెరువులోం చి వేసిన రోడ్డుగుండా శాంతినగర్‌కాలనీ ఎంట్రెన్స్‌లో ఆగి అక్క డ ఉన్న ఇండ్లను పరిశీలించి వాటి వివరాలను అధికారులను అడిగారు. ఆ నిర్మాణాల్లో అధిక శాతం సాకీ చెరువు ఎఫ్టీఎల్లో ఉన్నాయని అధికారులు ఆయనకు తెలిపారు.
కొందరు కోర్టులో కేసులు వేశారని వివరించారు. కోర్టు కేసుల వివరాలు తనకు తెలుపాలని కమిషనర్ సూచించారు. ఇప్పటికే 18 అక్రమ కట్టడాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారని, చాలాకాలం క్రితమే ఇండ్ల నిర్మాణం జరిగినట్లు ఉన్నదని రంగనాథ్ తెలిపారు. పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని వివరించారు. సాకీ చెరువు తూములు మూసివేసి ప్రముఖ నిర్మాణ సంస్థ అపార్టుమెంట్లు కడుతున్నదని పలువురు ఆయన దృష్టికి తీసుకొచ్చా రు.
స్పందించిన రంగనాథ్ చెరువుకు సంబంధించి ఎలాంటి ఆక్రమణలు ఉన్నా పరిశీలించి, విచారణ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. ఆరోపణలు వచ్చిన నిర్మాణానికి అనుమతులు ఉన్నాయని అధికారులు కమిషనర్‌కు తెలియజేశారు.నక్కవాగు బఫర్‌జోన్‌లో భారీ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారని, నక్కవాగుకు వచ్చే కాల్వలు గల్లంతయ్యాయని పలువురు విలేకరులు హైడ్రా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై కమిషనర్ తక్షణమే ఇరిగేషన్‌శాఖ అధికారుల వివరణ తీసుకున్నారు. అక్కడ పర్మిషన్లు తీసుకుని నిర్మాణాలు చేస్తున్నారా..? అని ప్రశ్నించారు. పర్మిషన్లతో కొన్ని నిర్మాణాలు ఉన్నాయని సందేహాస్పదంగా వివరణ ఇవ్వడంతో ఆయన నక్కవాగుకు సంబంధించి వివరాలతో కూడిన నివేదిక ఇవ్వాలని కోరారు. అనంతరం సాకీ చెరువు నక్షను పరిశీలించి వాటిలోని ఆక్రమణలను తెలుసుకున్నారు.
అమీన్పూర్, ఆగస్టు 31: సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పరిధిలోని చెరువులు, కుంటల పరిరక్షణే లక్ష్యంగా హైడ్రా ముందుకు సాగుతోంది. ఈ క్రమంలో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మించిన అక్రమ నిర్మాణాలపై అందిన ఫిర్యాదులను పరిగణలోకి తీసుకొని శనివారం హైడ్రా కమిషనర్ రంగనాథ్ విస్తృతంగా పర్యటించారు. అక్రమ నిర్మాణాలపై క్షుణ్ణంగా రికార్డులను పరిశీలించారు.
అమీన్పూర్ మున్సిపాలిటీలోని పెద్ద చెరువు,కుంటలను తనిఖీ చేశారు. ఎఫ్టీఎల్ బఫర్‌జోన్ నాలా కబ్బాలపై ఆరా తీశారు. నిబంధనలు ఉల్లంఘించి అక్రమంగా నిర్మించి న కట్టడాల వెనుక ఎవరు ఉన్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ వ్యాఖ్యలతో బడాబిల్డర్లు, నాయకుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కార్యక్రమంలో రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్‌శాఖల అధికారులు, సిబ్బంది,స్థానికులు పాల్గొన్నారు.