అమీన్పూర్, నవంబర్ 11 : సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ పరిధిలోని పటేల్‌గూడలోని బీఎస్ఆర్కాలనీ సర్వేనంబర్ 12లో గత సెప్టెంబర్‌లో స్థానిక రెవెన్యూ హైడ్రా అధికారుల ఆధ్వర్యంలో 26 ఇండ్లను కూల్చి వేశారు. ఇండ్ల నిర్మాణాల వ్యర్థాలను సోమవారం హైడ్రా అధికారులు తరలించేందుకు జేసీబీలతో వచ్చి హల్చల్ చేశారు. కూల్చిన ఇండ్ల వివాదం న్యాయస్థానంలో కొనసాగుతున్నదని, దీనిపై స్టేటస్కో సైతం ఉందని బాధితులు ఆందోళనకు దిగారు. బాధితుల తరపున న్యాయవాది హైడ్రా అధికారులతో మాట్లాడటంతో అక్కడి నుంచి వారు వెనుతిరిగారు.