నారాయణరావుపేట, మే 29: హైదరాబాద్ అంటేనే చార్మినార్. తెలంగాణలో కాకతీయ రాజుల వైభవం ఎనలేనిది. కాకతీయులు ప్రజల కోసం చెరువులు తవ్వించి, ప్రజా సంక్షేమం కోసం పాటుపడిన తీరు చిరస్మరణీయం. తెలంగాణ చరిత్ర, సంస్కృతి ఎంతో గొప్పది. అలాంటి వారిని స్మరించుకోవాలి. నేడు రాష్ట్ర చిహ్నం నుంచి కాకతీయ తోరణం, చార్మినార్ను ప్రభుత్వం తొలిగిస్తాననడం చాలా విచారకరం. గత చరిత్రను స్మరించుకుంటేనే భవిష్యత్ తరాలకు పునాది ఉంటుంది. అందుకోసం వాటిని ఎట్టి పరిస్థితుల్లో తొలిగించకూడదు. ఎంతో ఆలోచనలతో రూపొందించిన రాజముద్రలో మార్పు అవసరం లేదు.