హుస్నాబాద్, జనవరి 19 : రాష్ట్రంలోని ప్రజలను అంధత్వం నుంచి దూరం చేసి సంపూర్ణ అంధత్వ నివారణే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తున్నదని ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నా రు. గురువారం హుస్నాబాద్ పట్టణంలోని 1వ వార్డు కస్తూర్బా కాలనీ ప్రాథమిక పాఠశాలతో పాటు 11వ వార్డులోని బాలికల జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన రెండో విడత కంటి వెలుగు శిబిరాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటి సమస్యలతో చాలామంది బాధపడుతున్నారన్నారు. అవసరమైన వారికి వైద్య పరీక్షలు చేసి, కండ్ల అద్దాలు, ఆపరేషన్లు చేయించనున్నట్లు చెప్పారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తూ పేద మధ్య తరగతి ప్రజలకు ప్రయోజనం చేకూర్చుతున్న ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. ‘సర్వేంద్రియానాం నయనం ప్రధానం’ అనే నానుడిని ప్రభుత్వం నిజం చేస్తున్నదన్నారు. కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, వైస్ చైర్పర్సన్ అయిలేని అనితాశ్రీనివాస్రెడ్డి, కమిషనర్ రాజమల్ల య్య, డిప్యూటీ డీఎంహెచ్‌వో డాక్టర్ సౌమ్య, సీహెచ్‌వో శబ్దప్రకాశ్, ఐసీడీఎస్ సీడీపీవో జయ, కౌన్సిలర్లు కొం కటి నళినీదేవి, బోజు రమాదేవి, వాల సుప్రజ, దొడ్డి శ్రీనివాస్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వెంకట్రాంరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, మాజీ ఎంపీపీ ఆకుల వెంకట్, నాయకులు చిట్టి గోపాల్‌రెడ్డి, డాక్టర్ రవి, బొల్లి శ్రీనివాస్, గోనెల మధుకర్, విజయభాస్కర్, చిరంజీవి, ఇంతియాజ్, వైద్య సిబ్బంది, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భల్లునాయక్తండాలో కంటి వెలుగును ప్రారంభించిన ఎమ్మెల్యే
హుస్నాబాద్ రూరల్, జనవరి 19 : ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ ధ్యేయమని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్ కుమార్ అన్నారు. మండలంలోని భల్లునాయక్తండాలో గురువారం కంటివెలుగు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. రాష్ట్ర ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని ప్రవేశపెట్టారన్నారు. ప్రజలందరూ ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని కంటి పరీక్షలు చేయించుకోవాలని కోరారు. అనంతరం ఎమ్మెల్యే సతీశ్ కుమార్ స్థానిక ఎంపీపీ మానసకు స్వయంగా కంటి పరీక్షలు చేయించి, కంటి అద్దాలు అందజేశారు. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజలందరూ భాగస్వాములు కావాలని కోరారు. అవసరమైన వారికి కంటి ఆపరేషన్లు చేయించి కంటి అద్దాలు అందించనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ లకావత్ మానస, సర్పంచులు ఇస్లావత్ రజిత, వంగ విజయలక్ష్మి, తరాల లత, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రాంరెడ్డి, ఎంపీడీవో కుమారస్వామి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.