సీఎం కేసీఆర్ అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరుతున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామానికి చెందిన 50 మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు హైదరాబాద్‌లోని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి నివాసంలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూప్రాన్ మండలంలో ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీ తుడిచిపెట్టుకుపోయాయని, రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతీ కార్యకర్త పనిచేయాలని పిలుపునిచ్చారు.
-రామాయంపేట, ఆగస్టు 17
రామాయంపేట/తూప్రాన్, ఆగస్టు 17 : సీఎం కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. గురువారం తూప్రాన్ మండలం యావాపూర్ గ్రామానికి చెందిన సర్పంచ్ శేరి నర్సింహారెడ్డి తూప్రాన్ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి సమక్షంలో హైదరాబాద్‌లోని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి స్వగృహానికి యావాపూర్ గ్రామానికి చెందిన గ్రామ మాజీ ఎంపీటీసీ యంజాల స్వామి, ప్రస్తుత ఉప సర్పంచ్ లక్ష్మితో పాటు సుమారు 50 మంది కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తూప్రాన్ మండలంలోని ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీలు తుడిచిపెట్టుకుపోయాయన్నారు. బీఆర్ఎస్ పార్టీ చేపడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పార్టీలోకి ఇతర పార్టీల నాయకులు చేరుతున్నారన్నారు.
రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ముందుకు వచ్చి పని చేయాలని చైర్మన్ అన్నారు. గజ్వేల్ నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం ఖాయమన్నారు. తూప్రాన్ పట్టణ, మండల వ్యాప్తంగా భారీ మెజార్టీ సాధించడమే లక్ష్యంగా పని చేయాలన్నారు. మండల వ్యాప్తంగా ఇంకా చేరికలు ఉంటాయని మండలాధ్యక్షుడు బాబుల్ రెడ్డి అన్నారు. తూప్రాన్ పట్టణ, మండలంలోని ఏగ్రామంలో చూసినా బీఆర్ఎస్ జెండానే రెపరెపలాడుతుందన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమ పథకాలు ప్రతి ఇంట్లో కనిపిస్తున్నాయన్నారు. సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరూ ఆకర్శితులవుతూ పార్టీలోకి చేరుతున్నారన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని అభివృద్ధ్దిని తూప్రాన్ పట్టణం, మండలంలోని చూపిస్తున్నామన్నారు. ఇప్పటికే దాదాపు తూప్రాన్ మండలంలోని సగం గ్రామాల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల అడ్రస్ గల్లంతయిందన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, వార్డు సభ్యులు నాయకులు హాజరయ్యారు.