మునిపల్లి, జూన్ 23: సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలో ఆదివారం భారీ వర్షం కురిసింది. వారం నుంచి వర్షాలు లేక రైతులు దిగాలు చెందుతున్న క్రమం లో భారీ వర్షం కురవడంతో రైతులు సంబురపడుతున్నారు. ఇక ఎవుసం పనులు సాగుతాయని సంతోషం వ్య క్తం చేస్తున్నారు. భారీ వర్షంతో మండలంలోని పలు గ్రామా ల్లో చెరువులు, కుంటలకు నీళ్లు చేరాయి. బొడపల్లి- చిన్నచెల్మడ గ్రామాల మధ్య వాగు పొంగి పొర్లడంతో కొంతసేపు రాకపోకలు నిలిచిపోయాయి.